Take a fresh look at your lifestyle.

టెస్టులు ఎందుకు తక్కువ చేస్తున్నారో చెప్పాలి

‌ప్రజారోగ్యంతో ఆటలాడటం ప్రభుత్వానికి తగదని తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. కరోనా పరీక్షల విషయంలో ఇప్పటికైనా హైకోర్టు సూచనలను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంగా ఉత్తమ్‌  ‌ప్రభుత్వ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా టెస్టులపై హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా?  ఇష్టమొచ్చినట్టు పాలించడానికి మనం రాచరికంలో లేమంటూ ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దన్న ఉత్తమ్‌ ‌కోర్టు ఆదేశాలను వెంటనే అమలుపర్చాలని డిమాండ్‌ ‌చేశారు. కరోనా కేసులను దాచడంతో పాటు, చనిపోయిన వారికి ఎందుకు టెస్టులు చేయరని అన్నారు. అలాగే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అతితక్కువ టెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలావుంటే కరోనాపై కుట్ర చేస్తున్నారంటున్న సిఎం కెసిఆర్‌ …ఆ ‌కుట్రదారుడెవరో చెప్పాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత భట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్లు, పారామెడికల్‌ ‌స్టాఫ్‌కు కరోనా వచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కరోనాతో తెలంగాణ అతలాకుతలమైందని, రాష్ట్రంలో వైరస్‌ను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

సీఎం కేసీఆర్‌ ‌ప్రగతిభవన్ల్ఓ ‌క్షేమంగానే ఉంటారని, మరి ప్రజల సంగతేంటని ప్రశ్నించారు. కరోనా విజృంభిస్తుంటే సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు.సీఎం, మంత్రులు ఎక్కడుంటున్నారో తెలియదన్నారు. ప్రజాసమస్యలపై మంత్రులకు ఫోన్లు చేస్తే ఎత్తరని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లయిందని.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ ఉంటారో తెలియదని భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన డియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, ఎవరికైనా పిటిషన్‌ ‌పంపిద్దామంటే ఎవరు ఎక్కడుంటారో తెలియడం లేదన్నారు. ల్యాండ్‌లైన్‌కి ఫోన్‌ ‌చేస్తే.. అది పనిచేయదని, మొబైల్‌ ‌ఫోన్‌.. ‌వాళ్లు ఎత్తరని విమర్శించారు. కరోనాపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారని.. ఆ కుట్ర ఎవరు చెస్తున్నారో చెప్పాలని, ఆ కుట్ర ఏంటో బయటకు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply