Take a fresh look at your lifestyle.

టెన్త్‌లో అందరూ పాస్‌ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా విద్యార్థులందరినీ పాస్‌ ‌చేస్తున్నట్లు జీవో జారీ చేసింది. జిల్లా పరిషత్‌ ఎయిడెడ్‌, ‌ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ ‌విద్యార్థులందరినీ పాస్‌ ‌చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో టెన్త్ ‌విద్యార్థులకు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ‌ద్వారా గ్రేడ్స్ ఇవ్వనున్నట్లు
ప్రకటించింది. కరోనా విజృంభిస్తుండటం, కేసులు నానాటికీ పెరుగుతుండడం, హైకోర్టు ఆదేశాలు.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షలు రద్దు చేయడమే మేలని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

1969-70లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడంతో  అప్పడు పదో తరగతి విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా అందరినీ పాస్‌ ‌చేస్తున్నట్టు ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలోనూ తెలంగాణ ప్రభుత్వం అలాంటి నిర్ణయమే తీసుకుంది. గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అడ్వాన్స్ ‌సప్లమెంటరీ ఉత్తీర్ణత కలుపుకుంటే మొత్తం 98శాతం పైబడే ఉంటుంది. అంటే మొత్తంగా ఫెయిలైన విద్యార్థులు కేవలం 2శాతంలోపే ఉంటారు. ఈ గణాంకాల ఆధారంగా ఈ సారి కూడా అంతే ఉత్తీర్ణత నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ పాస్‌ ‌చేయడమే మేలనే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

Leave a Reply