వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

టెండర్‌ ‌వోట్లు పడకుండా సిబ్బంది జాగ్రత్త వహించాలి

May 10, 2019

పెద్దపల్లి జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌వనజాదేవిజిల్లాలో రెండవ దశ స్థానిక సంస్థ ఎన్నికల్లో టెండర్‌ ఓట్లు పడకుండా పోలింగ్‌ ‌సిబ్బంది జాగ్రత్త వహించాలని జెసి వనజాదేవి సంబంధిత అధికారులను ఆదేశించా రు. రెండవ దశ స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సుల్తానాబాద్‌ ఎం‌పిడివో కార్యాలయం, ఓదెలలోని తెలం గాణ మోడల్‌ ‌స్కూల్‌, ‌జూలపల్లి ఎంపిడిఒ కార్యా లయంలో ఏర్పాటు చేసిన బ్యాలేట్‌ ‌పత్రాల డిస్ట్రిబ్యూషన్‌ అం‌డ్‌ ‌రిసెప్షన్‌ ‌కేంద్రాలను జేసి గురువారం సందర్శించి అధికారులకు సూచనలు చేసారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, ఎలిగేడు, శ్రీరాంపూర్‌, ‌జూలపల్లి మండలాలోని 6 జడ్పీటిసి, 69 ఎంపిటిసి స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ ‌నిర్వహిస్తున్నా మన్నారు. ఇందు కోసం 378 పోలింగ్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.