Take a fresh look at your lifestyle.

జోరులో ఉన్న ఈ మొబిలిటి వాహనాలు..

  • భారత ఉపరితల రవాణా మరియు రహదారుల
  • కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ ఇ-మొబిలిటీ డివైజ్‌ ‌లను

చాలా పొగుడుతారు. వీటిని భారతీయ ప్రజలు అక్కున చేర్చువాలి అని పలు వేదికల్లో చెబుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలి అంటే అయన మంత్రి మాత్రమే కాదు ఇ-మొబిలిటీ డివైస్‌ ‌ల అంబాసిడర్‌ అని కూడా చెప్పవచ్చు. *ప్రపంచ వ్యాపితంగా ఇ-స్కూటర్లు..ఇ-బైకులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా సవాళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. న్యూయార్క్ ‌నగరం ఈ అంశానికి సంబంధించి పలు విషయాలను వెలుగులోకి తెచ్చింది. -*న్యూయార్క్ ‌నగరంలో ఇ-మొబిలిటీ బూమ్‌ ‌వలన రద్దీగా ఉండే వీధులలో గణనీయమైన భద్రతా సవాళ్లను తలెత్తుతున్నాయి. ఈ సంవత్సరం ఎలక్ట్రిక్‌ ‌మొబిలిటీ వాహనాలు నడుపుతూ 17 మంది ఇక్కడ మరణించారని న్యూయార్క్ ‌నగర అధికారులు చెబుతున్నారు.*-/+*కొరోనావైరస్‌ ‌మహమ్మారి రోజువారీ పట్టణ జీవితాన్ని అనేక విధాలుగా మార్చివేసింది. ఆఫీస్‌ ‌సంస్కృతి, ఎడ్యుకేషన్‌ ‌సెక్టార్‌ ‌లో పలు మార్పులు. షాపింగ్‌ ‌విభాగంలో ఆన్‌లైన్‌ ‌షాపింగ్‌ ‌ను పెంచటం, టెక్నాలజీ విభాగంలో పెను మార్పులను కొరోనా వైరస్‌ ‌మహమ్మారి తీసుకువచ్చింది.

అభివృద్ధి చెందిన అమెరికా దేశంలోని అతిపెద్ద నగరం న్యూయార్క్ ‌ప్రజల రవాణా సంప్రదాయాన్ని కూడా కొరోనావైరస్‌ ‌మహమ్మారి మార్చింది. విద్యుత్‌ ఆధారిత మొబైల్‌ ‌వాహనాలు ఇక్కడ బాగా పెరిగాయి. న్యూయార్క్ ‌లో రద్దీగా ఉండే రోడ్డు సిగ్నల్‌ ‌సిస్టంలో శాశ్వత మార్పును, భద్రతా సవాళ్ళను విద్యుత్‌ ఆధారిత మొబైల్‌ ‌వాహనాలు తీసుకువస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ ‌బైక్‌లు, స్కూటర్లు ఇతర రవాణా డివైస్‌ ‌లు ప్రధానగా పట్టణ జీవితం కోసం తయారు చేయబడ్డాయి. వీటిని పట్టణ వాసులు ఆదరిస్తున్నారు కూడా. ఎందుకంటే ఇవి చవక. పైగా పర్యావరణానికి మంచివి అని కార్పొరేషన్స్ ‌చెబుతున్నాయి. పార్కింగ్‌ ‌కోసం వీటికి తక్కువ స్థలం పడుతుంది. ఉపయోగించినప్పుడు పూర్తీ స్థాయి ఫన్‌ ఇస్తున్నాయి. న్యూయార్క్ ‌విశ్వవిద్యాలయంలో రూడిన్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌ట్రాన్స్‌పోర్టేషన్‌ ‌పాలసీ అండ్‌ ‌మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ ‌డైరెక్టర్‌ ‌సారా కౌఫ్మన్‌ ఇలా చెప్పారు.

‘‘పట్టణాల్లో అన్ని చోట్లకి తిరగటానికి సరైన సైజు వాహనం విద్యుత్‌ ఆధారిత మొబైల్‌ ‌వాహనాలు అని చాలా మంది అర్థం చేసుకున్నారు. ఇది మానవాళి జీవితంలో సంభవించిన పరిమాణం. మీరు పనికి వెళ్లడానికి %•ఖ•% వంటి విలువైన కార్‌ ‌వాడి కార్బన్‌ ఉద్గారాలను బయట పెట్టాల్సిన అవసరం ఇక లేదు’’అమెరికా దేశవ్యాప్తంగా ముఖ్యంగా నగరాలలో వున్నా ప్రజలు తమ కార్ల నుండి బయటకి రావటానికి ఎలక్ట్రిక్‌ ‌బైక్‌లు స్కూటర్లు ఎంతో కారకం అయ్యాయి. నడవడానికి చాలా దూరంగా వున్నా సబ్వే లేదా బస్సుకు చేరాలి అంటే విద్యుత్‌ ఆధారిత మొబైల్‌ ‌వాహనాలు ప్రజలు వాడుతున్నారు. దగ్గర ప్రయాణాల కోసం పట్టణ రవాణా వ్యవస్థలో నెలకొన్న అంతరాన్ని పూరించడానికి మార్గంగా విద్యుత్‌ ఆధారిత మొబైల్‌ ‌వాహనాలను ప్రజలు ఉపయోగిస్తున్నారు. అని అమెరికా రవాణా అధికారులు నిపుణులు చెబుతున్నారు.

మహమ్మారికి ముందే విద్యుత్‌ ఆధారిత మొబైల్‌ ‌వాహనాల వాడకం అమెరికాలో పెరిగింది అది ఇప్పుడు తారాస్థాయికి చేరుతున్నది. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ‌సిటీ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఆఫీసర్స్ ‌ప్రకారం, 2017 నుండి ఎలక్ట్రిక్‌ ‌స్కూటర్‌ ‌షేర్‌ ‌ప్రోగ్రామ్‌లు లాస్‌ ఏం‌జిల్స్, ‌వాషింగ్టన్‌, అట్లాంటాతో సహా 100 కి పైగా నగరాలకు వ్యాపించాయి. అంతకు ముందు సంవత్సరం 38.5 మిలియన్లు ఉన్న రోడ్‌ ‌రైడ్స్ 2019 ‌లో 130% పెరిగి 88.5 మిలియన్లకు చేరుకున్నాయి. మహమ్మారి సమయంలో అమెరికాలోని చాలా నగరాలలో స్కూటర్‌ ‌రైడర్‌షిప్‌ ‌పెరిగింది. అయితే ఇ-మొబిలిటీ బూమ్‌ ‌న్యూయార్క్‌లో రద్దీగా ఉండే వీధులకు గణనీయమైన భద్రతా సవాళ్లను తెచ్చిపెట్టింది. ఈ సంవత్సరం ఎలక్ట్రిక్‌ ‌మొబిలిటీ వాహనాలు నడుపుతూ 17 మంది మరణించారని న్యూయార్క్ ‌నగర అధికారులు తెలిపారు. నగరంలో ఎలక్ట్రిక్‌ ‌మోపెడ్‌ ‌షేర్‌ ‌ప్రోగ్రామ్‌ని నిర్వహించే రెవెల్‌ ‌సంస్థ, ముగ్గురు రైడర్లు మరణించిన కారణంగా గత ఏడాది ఒక నెల పాటు స్వచ్ఛందంగా తన పనిని నిలుపుకుంది.

అమెరికాలోని ఇ-మొబిలిటీ క్రాష్‌లు ఈ సంవత్సరం ముగ్గురు పాదచారుల ప్రాణాలను కూడా గాలిలో కలిపేసాయి. ఇందులో నటి లిసా బాన్స్ ‌వున్నారు. ఈమె ఎగువ వెస్ట్ ‌సైడ్‌లో హిట్‌ అం‌డ్‌ ‌రన్‌ ‌స్కూటర్‌ ‌రైడర్‌ ‌వలన ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది పాదచారులు సైక్లిస్టులు, ఇ-బైక్‌, ఇ-‌స్కూటర్‌ ‌రైడర్ల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇ-మొబిలిటీ డివైస్‌ ‌లు వాడేవారు వేగంగా కాలిబాటలపై ప్రయాణించడం, ఎర్ర లైట్లను ఉల్లంగించటం వంటివి చేస్తున్నారు. వేగవంతమైన ఇ-మొబిలిటీ విస్తరణను కొనసాగించడానికి అమెరికా నగర రాష్ట్ర అధికారులు పెనుగులాడుతున్నారు. చాలా ఇ-బైక్‌లు ఇ-స్కూటర్లు గత సంవత్సరం షోరూముల్లో కాకుండా నగర వీధుల్లో చట్టబద్ధం అయ్యాయి. వీటిని డెలివరీ కార్మికులు చాలా కాలంగా నడిపారు. కార్ల మాదిరిగా ఇవి రిజిస్టర్‌ ‌కావటం లేదు. లైసెన్స్ ‌లేదా బీమా పొందాల్సిన అవసరం వీటికి ఉండటం లేదు. స్కేట్‌ ‌బోర్డులు, యూనిసైకిళ్లు, హోవర్‌బోర్డులు సెగ్‌వేలతో సహా ఇతర రకాల ఇ-మొబిలిటీ డివైస్లు చట్టవిరుద్ధంగా ఉన్నప్పటికీ అమెరికాలో స్వైరవిహారం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు వాడే ప్రతి సరుకు.. అభివృద్ధి చెందుతున్న భారత్‌ ‌వంటి దేశాలకి దిగుమతి కావటం షరా మాములు అయిన నేపథ్యంలో అమెరికా దేశంలో ఇ-మొబిలిటీ డివైస్లు సృష్టిస్తున్న సమస్యలను మనం తప్పక పరిశీలించాలి.

Aruna journalist
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

Leave a Reply