వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జీ ‘హుజూర్‌’ ఎవరికి..?

September 22, 2019

రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకటన వెలువడడంతోనే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ దృష్టిని హుజూర్‌నగర్‌ ‌శాసనసభ ఉప ఎన్నికలపైనే కేంద్రీకరిస్తున్నాయి. ఈ ఎన్నికలను ఇంచుమించు అన్ని పార్టీలు ప్రతిష్టగానే భావిస్తున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం తామేనని చెప్పుకుంటున్న బిజెపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంటే, తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని పదిలపర్చుకోవడం కోసం కాంగ్రెస్‌ ‌కసరత్తు చేస్తోంది. కాగా, స్వల్ప మెజార్టీతో కోల్పోయిన ఈ స్థానాన్ని ఈసారైనా దక్కించుకోవాలని అధికార పార్టీ వ్వూహరచన చేస్తున్నది. అక్టోబర్‌ 21 ఇక్కడ హోరాహోరీగా జరుగనున్న ఎన్నికల సమరాంగానికి పార్టీలన్నీ తమ అస్త్రశస్త్రాలతో సమాయత్తమవుతున్నాయి. గతంలో ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడంద్వారా ఈ నియోజకవర్గాన్ని చేజార్చుకున్న తెలంగాణ రాష్ట్రసమితి నోటిఫికేషన్‌ ‌వెలువడిన ఒకటి రెండు గంటల్లోనే తన అభ్యర్థిని ప్రకటించింది. ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వం కోసం ఆ పార్టీలోని అనేకమంది ఆశపడ్డారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎం‌పి స్థానాన్ని కోల్పోయిన కవితకు ఇక్కడ టికెట్‌ ఇచ్చి రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకుంటారన్న ఊహాగానాలు వినిపించాయి. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మరోసారి ఈ స్థానం విషయంలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయినా అధిష్టానం గత ఎన్నికల్లో అతిస్వల్ప (7,460) వోట్ల తేడాతో ఓడిన శానంపూడి సైదిరెడ్డికే మరోసారి అవకాశ మిచ్చింది. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ నియోజ• •వర్గాన్నే అంటిపెట్టుకుని ఉండడంతో అక్కడి ప్రజల్లో ఆయనపట్ల సానుభూతి ఉంది.

అనధికారికంగా తమ అభ్యర్థిలను ప్రకటించి కాంగ్రెస్‌పార్టీ పెద్ద గందరగోళంలో పడింది. ఈ ఎన్నికతో అటు టిఆర్‌ఎస్‌, ఇటు బిజెపి లాభపడాలని చూస్తుంటే సిట్టింగ్‌ ‌స్థానానికి అభ్యర్థిని ప్రకటించుకోవడంలో కాంగ్రెస్‌ ‌చిక్కులో పడింది. ఆ స్థానం నుండి గత ఎన్నికల్లో గెలిచి, ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపిగా ఎన్నికైనా కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. నిన్నటివరకు తాను ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం ఒకటి కాగా, రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడమనే ప్రధాన లక్ష్యంతో ఆయన ఈ ఎన్నికను ఛాలెంజీగా తీసుకుంటున్నాడు. అందుకు తగిన అభ్యర్థి తన భార్యేనన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఆయన భార్య పద్మావతి మాజీ ఎంఎల్‌ఏ ‌కూడా. అయినా ఆమె పేరును ప్రకటించడం కాంగ్రెస్‌లో చిచ్చులేపింది. ఈ ప్రకటనపై పార్టీ దాదాపు రెండు వర్గాలుగా చీలింది. కాంగ్రెస్‌ ‌పార్టీకి అయువుపట్టు అయిన నల్లగొండలోని సీనియర్‌ ‌నాయకులంతా ఒక్కటై, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయానికి మద్దతిస్తుండగా, ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌రేవంత్‌రెడ్డితో పాటు ఆయన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతటితో అగకుండా తన అభ్యర్థి అంటూ యువజన కాంగ్రెస్‌ ‌నాయకుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును రేవంత్‌రెడ్డి ప్రకటించడం ఇప్పుడాపార్టీలో దుమారాన్ని లేపుతోంది.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీని సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడమేంటని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియాకు రేవంత్‌ ‌ఫిర్యాదు చేయడంతో నల్లగొండ సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకులంతా రేవంత్‌పై ఆగ్రహిస్తున్నారు. నల్లగొండ రాజకీయాల్లో మరో జిల్లావాసులు వేలుపెట్టడాన్ని ఎట్టి పరిస్థితిలో సహించేదిలేదంటున్న ఈ సీనియర్‌లు ఉత్తమ్‌కు మార్‌రెడ్డి ప్రకటించిన పద్మావతినే గెలిపించుకుం టామంటున్నారు. సుమారు ముప్పైవేల మెజార్టీతో పద్మావతిని గెలిపించుకుంటా మంటున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇది స్వంత నియోజకవర్గం కావటం, 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండీ ఆయనే ఇక్కడ వరుసగా గెలుస్తూ రావడం కలిసివస్తుందన్నది కాంగ్రెస్‌ ‌సీనియర్ల వాదన. గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో కోమటిరెడి రాజగోపాల్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏగా గెలుపొందాడు. అయితే ఇక్కడున్న రెండు పార్లమెంటు స్థానాలను మాత్రం కాంగ్రెస్‌ ‌చేజిక్కించుకుంది. అందులో ఒకటి నిన్నటివరకు హుజూర్‌నగర్‌కు ప్రాతినిద్యం వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరోస్థానాన్ని కోమటిర్డె• వెంకటరెడ్డి గెలుచుకున్నారు. కాంగ్రెస్‌ ‌తన పూర్వ వైభవానన్ని నిలుపుకునేందుకు వ్వూహరచన చేస్తున్నది. అయితే ఇంకా ఇక్కడ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థి ప్రకటన తర్వాత ఆ పార్టీలో ఎలాంటి మార్పులు సంభవిస్తా యోనన్న అనుమానానికి తావేర్పడుతున్నది. ఇదిలాఉంటే అధికార టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయ మంటున్న భారతీయ జనతాపార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు స్థానాలను దక్కించుకున్నప్పటి నుండీ దూకుడుగా ముందుకు వస్తున్న బిజెపి, అధికార టిఆర్‌ఎస్‌కు ధీటైన వ్యక్తిని ఎంపికచేసే వేటలో ఉంది. ఈ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా మరోసారి తమ సత్తాను చాటుకోవాలని తెగ
ఉత్సాహపడుతున్నది.


మండువ రవీందర్‌ ‌రావు
గెస్ట్ ఎడిటర్‌