వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జీవించే హక్కుకి బతుకెక్కడ..?

September 11, 2019

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు డేగ వెంకటేశ్వర్లు

రాజ్యంగం కల్పించిన ప్రాధమిక హక్కు ఐన  జీవించే హక్కును కాలరాస్తున్న ప్రభుత్వాలు..ఆ హక్కుకు బతుకెక్కడో వుంధో చూపించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు డేగ వెంకటేశ్వర్లు డిమాండ్‌ ‌చేసారు.
బుదవారం స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌.ఎస్‌.‌పి క్యాంపు మరియు అమరవీరుల స్థూపం వద్ద యురేనియం కు వ్యతిరేకంగా తెలంగాణ విద్యావంతుల వేదిక చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పేరిట మానవ హక్కులను హరిస్తూ  లాభాల కోసం కార్పొరేట్‌ ‌శక్తుల యొక్క వ్యాపారాన్ని ప్రాధమిక హక్కుగా మారుస్తూ యురేనియం వెలికితీత కు పూనుకోవడం రాజ్యాంగ అతిక్రమణ చర్య అన్నారు.మానవ అభివృద్ధి రేటునే పెంచాలనే లక్ష్యం ఈ పాలకులకు వుంటే యురేనియం తో ఉత్పత్తి అయ్యే అణుశక్తి అవసరం లేదన్నారు.విద్యుత్‌  ఉత్పాదనే ఈ దేశ అభివృద్ధి కి కొలమానం అనుకుంటే ప్రకృతిలో  సూర్యకాంతి, పవన విద్యుత్‌, ‌సముద్రపు అలలు, బయే ధర్మల్‌ ‌లాంటి అనేక తరగని శక్తి వనరుల ద్వారా అతి తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ప్రజా ఉధ్యమాల రీత్యా,ప్రజాభిప్రాయం దృష్ట్యా పర్యావరణ పరిరక్షణ కోసం,మానవ హక్కుల కోసం,ఆదివాసుల రక్షణ కోసం అనేక చట్టాలను రుపొందించిన పాలకులే భక్షకులవుతుంటే ప్రజల హక్కులను రక్షించేవారు ఎవరని ఆవేధన వ్యక్తం చేశారు.యురేనియం మైనింగ్‌ ‌వల్ల తలెత్తే విధ్వంసక పరిణామాలను ప్రపంచ దేశాలతో పాటు మన పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, ‌జార్ఖండ్‌, ‌లలో చవి చూసారన్నారు.ఐనా ఈ పాలకుల విదానాలో మార్పు రాకపోవడం మూరఖత్వం అన్నారు. పర్యావరణాన్ని, జంతు జీవజాలాన్ని కాపాడుకోవడానికి ప్రజలంధరు తిరగబడి హక్కుల కోసం పోరాడితే తప్ప ఈ పాలకుల నిరంకుశ వైఖరి లో మార్పు రాదన్నారు.యురేనియం పోరాటంలో ,అన్ని ప్రజా సంఘాలు,పార్టీ లు క్రీయాశీలకంగా భిన్న రూపాలలో ఈ ఉధ్యమాన్ని ముంధుకు తీసుకపోవాలన్నారు.
మిర్యాలగూడ విద్యావంతుల వేదిక బాద్యులు కొండమడుగు రాజు మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా అడవిని కాపాడుకుంటూ బతుకుతున్న ఆదివాసుల,గిరిజనుల జీవితాలను బుగ్గి పాలు చేసే హక్కు ఈ పాలకులకు లేదన్నారు. వారు రుపొందించిన చట్టాలనే వారు గౌరవించనప్పుడు  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు నమ్మకం ఎట్ల కలుగుతుంధన్నారు.
ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక నాయకులు బెల్లంకొండ హరిక్రిష్ణ,అశోక్‌, ‌కొల్లు శ్రీనివాస్‌, ‌మనోజ్‌, అనిత,కవిత,రఘు, ప్రశాంత్‌,‌బాబు,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.