వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జీడీపీ.. ఈసారి 6.2శాతమే!

August 23, 2019

వృద్ధిరేటు అంచనాలను తగ్గించిన మూడీస్‌
ఆర్థిక మందగమనం నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది అంతర్జాతీయ రేటింగ్‌ ‌సంస్థ మూడీస్‌. 2019 ‌క్యాలెండర్‌ ‌సంవత్సరంలో 6.8శాతం జీడీపీ వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయని గతంలో మూడీస్‌ అం‌చనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ అంచనాలను 6.2శాతానికి సవరించింది. ఇక 2020 క్యాలెండర్‌ ‌సంవత్సరంలో 6.7శాతం వృద్ధిరేటు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం ఆసియా ఎగుమతులు తగ్గాయని, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని మూడీస్‌ అభిప్రాయపడింది. ఇటీవలే మరో రేటింగ్‌ ‌సంస్థ క్రిసిల్‌ ‌కూడా భారత జీడీపీ వృద్ది అంచనాలను సవరించింది. అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.1శాతం వృద్ధిరేటు నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసిన క్రిసిల్‌.. ఆ ‌తర్వాత దాన్ని 6.9శాతానికి తగ్గించింది. మరోవైపు ఆగస్టు ద్వైమాసిక సమీక్షలో భారతీయ రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కూడా జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.9శాతం జీడీపీ వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.