వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జీడిమెట్లలో కెమికల్ అగ్నిప్రమాదాలతో బెంబేలెత్తుతున్న స్థానికులు..

September 21, 2019

జీడిమెట్లలో కెమికల్ కంపెనీలో కెమికల్ రసాయనాలు కలుపుతుండగా రియాక్షన్, మిస్ ఫైర్ అవడం తో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది.జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో “కార్తీకేయ కామాక్షి కెమికల్ కంపెనీలో” శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున సుమారు 5:00 గంటల ప్రాంతంలో కంపెనీ సిబ్బంది కెమికల్ రసాయనాలు కలుపుతుండగా రియాక్షన్ తో జరిగిన సంఘటనలో రియాక్టర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చి మంటలు రావడంతో, కంపెని కార్మికులు భయంతో కంపెనీ భయటకు పరుగులు తీశారు.. కార్మికులు వెంటనే జీడిమెట్ల ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో, 5 ఫైర్ ఇంజన్ లతో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.