Take a fresh look at your lifestyle.

జాబ్‌కార్డులు ఉన్నవారందరికీ ఉపాధి పనులు కల్పించాలి

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించడంతో ఉపాధి కోల్పోయి పనులు లేక ఇబ్బంది పడుతున్న జాబ్‌ ‌కార్డు ఉన్న పెద్దలందరికీ ఉపాధి హామీ పనులు చూపించాలని, ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు కొలతల తో సంబంధం లేకుండా రోజుకూలీ 600 రూపాయలు ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి నెలకు 7500 రూపాయలు చొప్పున ఆరు నెలలు ప్రభుత్వం సాయం చేయాలని, ప్రతి కుటుంబానికి 50 కేజీలు సన్న బియ్యం పంపిణీ చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం సి ఐ టి యు ఆదివాసీ గిరిజన సంఘం కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ముందు ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలియ చేసి ఎంపీడీవో రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌గారికి వినతి పత్రం అందించడం జరిగింది.. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు లో భాగంగా ప్రభుత్వ సూచనలు సలహాలు మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భద్రాచలం పట్టణం లో జాబ్‌ ‌కార్డు లో ఉన్న ప్రతి వారికి ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు.ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గడ్డం స్వామి, సిఐటియు పట్టణ నాయకులు ఎం బి నరసారెడ్డి, బి వెంకట రెడ్డి ,బండారు శరత్‌ ‌బాబు, నకిరేకంటి నాగరాజు, చుక్కా మాధవరావు సిపిఎం ఎంపీటీసీ సభ్యులు చేగొండి శ్రీనివాస్‌, ఆదివాసి తెలంగాణ గిరిజన సంఘం నాయకులు కుంజ శ్రీనివాస్‌, ‌సున్నం గంగా, వృత్తి దారుల సంఘం నాయకులు అందుర్తి రాజ్‌ ‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply