వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జాడలేని కిట్లు

April 2, 2019

ఆరు నెలలుగా నిలిచిన ఆరోగ్య కిట్ల సరఫరా
ప్రతి సంవత్సరం 4సార్లు పంపీణీ చేసేలా ప్రణాళిక
ఇంకా రెండు విడతల కిట్లు పెండింగ్‌లోనే..
బయట కొనుగోలు చేస్తున్న విద్యార్థులుఆడపిల్లల చదువుల కోసం ప్రభుత్వాలు ఎన్నో నిధులు ఖర్చు చేస్తూ ఉన్నా.. సరైనా ఫలితాలు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్యోగ రక్ష కిట్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. కౌమార దశలో ఉన్న బాలికల చదువుకు వారి వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ద కోసం వారికి ఆరోగ్య పరిశుభ్రత కిట్ల పంపిణీ చేపట్టారు. గతంలో ఉన్నత పాఠశాలలో చదివే బాలికలకు కేవలం సానిటరీ నాప్‌కిన్స్ ‌మాత్రమే అందజేశారు. కానీ 2018 విద్యా సంవత్సర ప్రారంభం నుంచి విద్యార్ధినీలకు రూ.1600 ఖర్చుతో కూడిన 13 రకాల సామాగ్రితో కిట్లను అందించేందుకు సమగ్ర శిక్ష ద్వారా శ్రీకారం చుట్టింది. ఏడాదికి నాలుగు సార్లు కిట్ల పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో పథకాన్ని ప్రారంభించింది. గతేడాది ఆగస్టు 24వ తేదీన విద్యార్థినులకు ఆరోగ్య కిట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం వాటి ఊసే ఎత్తుడం లేదు. ఆరు నెలలుగా లేక విద్యార్థునులు ఇబ్బందులు పడుతున్నారు. మరో నెలన్నరలో పూర్తి కానున్న ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంకా రెండు కిట్లు రావాల్సి ఉంది. అచ్చంపేట నియోజకవర్గంలో చదువుతున్న 3468 మంది విద్యార్థునులు ఉన్నారు.
ఎన్నికల కోడ్‌ అడ్డంకి..
ప్రతి విద్యా సంవత్సరంలో మూడు నెలలకోసారి నాలుగుసార్లు ఆరోగ్య పరిశుభ్రత కిట్లను అందజేయాలి. ఈ విద్యాసంవత్సరంలో ఆరోగ్యకిట్ల పంపిణీ కార్యక్రమం ఆగస్టులో ప్రారంభమైంది. వీటిపై ప్రభుత్వానికి సంబంధించిన స్టిక్కర్లు అంటించారు. నవంబర్‌లో తిరిగి రెండో విడత కిట్ల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉండటంతో ఎన్నికలు కూడా వచ్చాయి. ఎన్నికల కోడ్‌ అడ్డంకి గామారింది. దీంతో కిట్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు నోటిఫికేషన్‌ ‌కూడా విడుదల అయింది. మరోసారి కోడ్‌ అడ్డుగా మారవచ్చు.
కిట్‌లో ఉండే వస్తువులు..
కిట్‌లో సానిటరీ నాప్‌కిన్‌లతో పాటుగా వారికి కావాల్సిన సామాగ్రితో కలిపి 13రకాల వస్తువులు ఉంటాయి. 100గ్రాముల చొప్పున 3పతాంజలి బాత్‌సోప్‌, 3 ‌డిటర్జెంట్‌ ‌సబ్బులు, 175 మి.లి.కొబ్బరి నూనె డబ్బా, 150మి.లి షాంపో, 50గ్రాముల పౌడర్‌ ‌డబ్బా, 100గ్రాముల పేస్టు, 2.5 మీటర్ల చొప్పున 2రిబ్బన్లు, జడ రబ్బర్లు, బ్రష్‌, ‌టంగ్‌ ‌క్లీనర్‌, ‌దువ్వెన, బొట్టు బిల్లలు, మూడు సానిటరీ నాప్‌కిన్‌ ‌పాకెట్లు ఉంటాయి. వీటన్నింటిని ఒక ప్లాస్టిక్‌ ‌డబ్బాలో పెట్టి విద్యార్థినులకు అందించారు. కాగా రెండోసారి డబ్బా లేకుండా కవర్లలో ప్యాక్‌ ‌చేసి అందించేందుకు నిర్ణయించినట్లు విద్యాశాఖాధికారులకు సమాచారం అందినా.. పంపిణీ మాత్రం జరగలేదు. మొదటి విడతలో కూడా నియోజకవర్గనికి సరిపడా కిట్లు రాలేదని సమాచారం. రానివారికి రెండో విడతలో కిట్లను పంపిణీ చేస్తామని చెప్పిన అధికారులు, రెండో విడత కిట్ల జాడ లేక పోవడంతో విద్యార్థులను వారి సొంత డబ్బుతో అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నారు. కొందరు తల్లితండ్రులైతే వారే కొనుగోలు చేసి విద్యార్థులకు తెచ్చి ఇస్తున్నారు. గైర్హాజరీని తగ్గించేందుకు. బాలికలు నెలసరి సమస్యల వలన పాఠశాలకు గైర్హాజరు కాకుండా ఉండాలంటే నాప్‌కిన్లతో కూడిన ఆరోగ్య పరిశుభ్రత కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. కేజీబీవీల్లో ఆరు నుంచి ఇంటర్‌ ‌చదివే విద్యార్థునులు, ఆదర్శ పాఠశాలలో 7నుంచి ఇంటర్‌ ‌వరకు, వసతి గృహం విద్యార్థులనుకు, ప్రభుత్వ ఉన్నత ఎయిడెట్‌ ‌పాఠశాలల్లో 7నుంచి పదోవ తరగతి వరకు, గురుకులాల్లో ఆరు నుంచి ఇంటర్‌ ‌చదవే విద్యార్థినులకు ఈ కిట్లను అందజేశారు. కానీ ప్రస్తుతం కిట్లు అందించకపోవడంతో విద్యార్థినుల గైర్హాజరు పెరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మంచి ఫలితాలు వచ్చాయి.
బల్మూర్‌ ‌కేజీబీవీ ఎస్‌ఓ ‌లలిత..
ఆరోగ్య కిట్ల పంపిణీ అనంతరం విద్యార్థినుల్లో చాలా మార్పు వచ్చింది. శుభ్రత, ఆరోగ్యం విషయంలో మంచి ఫలితాలు వచ్చాయి. పంపిణీ చేసిన కిట్లు అయిపోవడంతో విద్యార్థులు మానసిక వేదనకు లోనవుతున్నారు.