వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలని విన్నతి

April 5, 2019

జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలని  ఐఎంఎ అధ్యక్షులకు వినతి పత్రాన్ని ఇస్తున్న దృశ్యం
జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలని ఐఎంఎ అధ్యక్షులకు వినతి పత్రాన్ని ఇస్తున్న దృశ్యం

జర్నలిస్టులకు ఉచిత వైద్యం అందించాలని ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌కు గురువారం నాడు టియుడబ్ల్యూజె (ఐజెయు) వనపర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో పనిచేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలని ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డా.లలిత కృష్ణకుమారి కి కలిసి టియుడబ్ల్యూజె (ఐజెయు) వనపర్తి శాఖ ఆధ్వర్యంలో కోరారు. టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా కమిటి ఆదేశాల మేరకు వనపర్తి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లట్టుపల్లి రవికాంత్‌ ‌భాస్కర్‌ ‌యాదవ్‌ల ఆధ్వర్యంలో డాక్టర్‌ ‌లలితా కృష్ణకుమారి చాంబర్‌లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టు కుటుంబాలకు ఉచితక వైద్యం అందించడానికి అసోసియేషన్‌ ‌సభ్యులతో చర్చిస్తామని ఆమె తెలిపారు. త్వరలో జర్నలిస్టు కుటుంబాల ఉచిత వైద్యం గురించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఐఎంఎ సానుకూలంగా స్పందించడం పట్ల వనపర్తి టియుడబ్ల్యూజె (ఐజెయు) ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రంలో పట్టణ ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌, ‌ప్రచార కార్యదర్శి ఆంజనేయులు, కార్యదర్శులు, సురేష్‌, ‌రమేష్‌, ‌సిరాజ్‌, ‌ప్రశాంత్‌, ‌కార్యవర్గ సభ్యులు దినేష్‌ ‌తదితరులు పాల్గొన్నారి.