వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జమ్మూకశ్మీర్‌లో ప్రశాంతంగా బక్రీద్‌ ‌పర్వదినం

August 12, 2019

జమ్మూకశ్మీర్‌లో బక్రీద్‌ ‌వేడుకలను ముస్లిం సోదరులు ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. కశ్మీర్‌ ‌లోయతో పాటు వివిధ నగరాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. రాచౌరీలో మసీదులో వందలాది మంది నమాజ్‌ ‌చేశారు. జమ్మూలోని ఈద్గాలో సుమారు 5వేల మంది నమాజ్‌ ‌చేసినట్లు జమ్మూకశ్మీర్‌ ‌ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శి రోహిత్‌ ‌కన్సాల్‌ ‌తెలిపారు. సోమవారం అంతర్జాతీయ బోర్డర్‌ ‌వద్ద పాకిస్థాన్‌ ‌రేంజర్లు, బోర్డర్‌ ‌సెక్యూర్టీ ఫోర్స్ ‌దళాలు మిఠాయిలు పంచుకోలేదు. పాక్‌ ‌రేంజర్లకు స్వీట్లు ఇచ్చేందుకు బీఎస్‌ఎఫ్‌ ‌ప్రయత్నించింది. కానీ పాక్‌ ‌నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత కశ్మీర్‌ ఓ ‌రకంగా నిర్మానుషంగా మారింది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో జనం ఎక్కువగా వీధుల్లోకి రావడం లేదు. టూరిస్టుల సంఖ్య కూడా తగ్గింది.