Take a fresh look at your lifestyle.

జనవరి 3 నుండి 23 వరకు శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవములు

  • 12వ తేదీన గోదావరి నదిలో ‘‘తెప్పోత్సవం’’
  • 13 తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2022 జనవరి 3 నుండి 23 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటి నిర్ణయించింది. ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కోవిడ్‌ ‌నియమ నిబంధనలను పాటిస్తూ నిర్వహించటం జరుగుతుందని దేవస్థానం ఇఓ శివాజీ తెలిపారు. జనవరి 12వ తేది బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో శ్రీస్వామివారికి గోదావరి నదిలో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. తెల్లవారుజామున అనగా 13వ తేది ఉత్తర ద్వారదర్శనం నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవ నామసంవత్సర పుష్యశుద్ధ పాడ్యమి సోమవారం నుండి పుష్య బహుళ పంచమి మరియు షష్టి ఆదివారం నాడు నిర్వహించటం జరుగుతుందని తెలిపారు.

3వ తేది సోమవారం నాడు ‘‘మత్స్యవతారం’’, 4వ తేది మంగళవారం ‘‘కూర్మావతారం’’, 5వ తేది బుధవారం ‘‘ వరాహవతారం’’, 6వ తేది గురువారం ‘‘నరసింహవతారం’’, 7వతేది శుక్రవారం ‘‘ వామనావతారం’’, 8వ తేది శనివారం ‘‘పరశురామవతారం’’, 9వ తేది ఆదివారం ‘‘శ్రీరామవతారం’’, 10వ తేది సోమవారం ‘‘బలరామవతారం’’, 11వ తేది మంగళవారం ‘‘శ్రీకృష్ణవతారం’’ లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం 14 నుండి 23 వరకు వివిధ ప్రాంతాల్లో స్వామివారి ఉత్సవాలు నిర్వహించబడతాయని తెలిపారు.

Vaikuntha Ekadashi applied adhyayanotsavalu

విలాసోత్సవములు
24వ తేది సోమవారం శ్రీరామధాన మండపం, 25వ తేది మంగళవారం పురుషోత్తపట్టణంలోని తమ్మక్క మండపం, 26వ తేది దేవస్థానం సిబ్బందిచే వశిష్ట మండపం వద్ద విలాసోత్సవములు నిర్వహించబడతాయని తెలిపారు. 29వ తేది శనివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9గంటల వరకు విశ్వరూపసేవ నిర్వహించబడుతుందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బి. శివాజీ తెలిపారు.

Leave a Reply