Take a fresh look at your lifestyle.

జడ్జి రామకృష్ణకు కరోనా పాజిటివ్‌

పోలీసుల అదుపులో ఉన్న జడ్జి రామకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిపై సీఎం జగన్‌, ‌మంత్రి పెద్దిరెడ్డి కక్ష కట్టారని రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఆరోపించారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తన తండ్రికి నెగిటీవ్‌ ‌వచ్చినట్లు చెప్పారని, ఆ తర్వాత పాజిటీవ్‌ ‌నిర్దారణ కావడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. తన తండ్రికి ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి బాధ్యత వహించాలని వంశీకృష్ణ హెచ్చరించారు. తన తండ్రిని పోలీసులు హడావిడిగా పీలేరు జైలు నుంచి తిరుపతిలో ఆస్పత్రిలో చేర్పించారని వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వ వైద్యంపై తమకు నమ్మకం లేదని, ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్సకు అనుమతి కోసం హైకోర్టులో హౌస్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశామని వంశీకృష్ణ తెలిపారు.

Leave a Reply