Take a fresh look at your lifestyle.

జగన్‌ ‌పట్టు కోల్పోతున్నాడా..?

దేశంలో రాజకీయ వేత్తలందరిలో కనిపించే ఉమ్మడి లక్షణం ప్రతీదీ రాజకీయం చేయకుండా ఉండలేకపోవడం. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా అదికారాన్ని చేపట్టిన వైఎస్‌ ‌జగన్‌ ఆం‌ధ్రప్రదేశ్‌ ‌చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీని సాధించారు. బలమైన ప్రత్యర్ధి నేతృత్వంలోని పార్టీని చిత్తుగా ఓడించారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వ్యతిరేకంగా ఎంతో కాలంగా చేస్తున్న పోరాటం ఫలితంగా జగన్‌ ఇం‌త పెద్ద విజయాన్ని సాధించగలిగారు. ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించారు. రాజకీయ నాయకులందరిలో ఉండే ఉమ్మడి లక్షణమే ఇది. తెలుగు దేశం పార్టీని మట్టి కరిపించడంతో ఆయన తన జీవితాశయాన్ని సాధించారు. అయితే,ఆయన కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జగన్‌ ‌తిరుగులేని విజయం ఆంధ్రప్రదేశ్‌ ‌రాజకీయాల్లో చెప్పుకోదగిన పరిణామం. చంద్రబాబునాయుడు పాలనతో జనం విసిగెత్తి పోవడంతో వైసీపీకి పట్టం కట్టారు. జగన్‌ ‌విజయంలో రెండు ముఖ్య విషయాలు ఉన్నాయి. చంద్రబాబునాయుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి వ్యతిరేకమని జనంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఆమరావతిలో ఇటుక పెట్టకపోయినా రాష్ట్ర రాజధానిపై అద్భుతమైన ప్రచారం చేయించారని ఆరోపించారు. అమరావతి అంటే భ్రమరావతి అని ప్రచారం చేసి జనాన్ని నమ్మించడంలో వైసీపీ విజయం సాధించింది.రెండో విషయం ఏమిటంటే తనపై అనేక అవినీతి ఆరోపణలు చేసి జైలుకు పంపి వేధించారని క్షేత్ర స్థాయిలో ప్రజలకు చెప్పివారిని జగన్‌ ‌వారి సానుభూతి పొందగలిగారు. వచ్చే ఐదేళ్ళలో ప్రజలు తన నుంచి ఏం కోరుతున్నారో ఆయన గ్రహించారు. ఆయన అధికారం చేపట్టిన తర్వాత పాలన కేంద్రీకృతం అయింది. ఆయన విచక్షణకు వదిలివేయబడుతోంది దురదృష్టమేమంటే, చంద్రబాబునాయుడు ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి నించి బయట పడటం జగన్‌ ‌కు పెను సవాల్‌ ‌గా తయారైంది. ఆయనపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ముందున్న సవాళ్ళకు ఆయన ఎంతో చాకచక్యంగా, సమతుల్య మైన రీతిలో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ‌లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి జగన్‌ ‌తన దృష్టిని కేంద్రీకరించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ‌వ్యవసాయిక రాష్ట్రం కావడం వల్ల వ్యవసాయ కూలీలు, ఇతర శ్రామికులకు పనులు కల్పించే విషయమై జగన్‌ ‌శ్రద్ద తీసుకోవాలి. విధాన పరమైన రాజీ లేకుండా జగన్‌,ఆయన అనుచరులు అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యలను ఎలా అరికట్టవచ్చునో జగన్‌ ఆలోచించాలి. పూర్వపు ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలనూ, సంక్షేమ కార్యక్రమాలను నిలిపి వేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపు కిందికి రాదు., ఆదర్శప్రాయమైన సమాజంలో రాజకీయాలు ఎప్పుడూ సిద్ధాంత పరంగానే సాగాలి. వ్యక్తుల మీద కన్నా సిద్ధాంతాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే, ప్రస్తుతం రాజకీయాలన్నీ వ్యక్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. పాత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడాన్ని ఎవరూ అసూయ పడరు. అయితే, ప్రజలకు చెప్పే కారణాలు సహేతుకంగా ఉండాలి. జగన్‌ ‌వయసు 46 సంవత్సరాలు మాత్రమే. భారత రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న నాయకులను పరిశీలిస్తే చిన్న వయసులోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు పాలన చేయాల్సి ఉంది ఆయన తన ముందు పెట్టుకున్నది పెద్ద అజెండా, దానిని అమలు జేయడామనికి నిద్రాహారాలు మాని నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. కాని,ఆయన లో అటువంటి ఆలోచన కనిపించడం లేదు. ఆయన దారి తప్పుతున్నారేమోననిపిస్తోంది.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy