Take a fresh look at your lifestyle.

జగన్‌ ‌పట్టాభిషేకానికి టాలీవుడ్‌ ‌దూరం?

పిలువ లేదా? పిలిచినా రాలేదా?
పృథ్వి మాటల వెనుక మర్మమేంది…

ఎ. సత్యనారాయణ రెడ్డి, (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

ఇప్పుడు అంతటా ఒకటే చర్చ. జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి పట్టాభిషేకంకు తెలుగు చిత్ర పరిశ్రమ(టాలీవుడ్‌)‌కు చెందిన వారెవ్వరూ హాజరు కాకపోవడంపై. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే.. సహజంగా ప్రముఖులు హాజరు అవుతారు. మరీ ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో ఏమో కానీ జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ప్రమాణ స్వీకారంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు దూరంగా ఉండటం పట్ల ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే…ఆంధ్రప్రదేశ్‌ ‌రెండో ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత, వైఎస్‌ ‌జగన్‌ ‌మెహన్‌ ‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరా మైదానం ఇందుకు వేదికైంది.గవర్నర్‌ ‌నరసింహన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు, డీఎంకే అధినేత స్టాలిన్‌ ‌తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివచ్చారు. అయితే, ఇండస్ట్రీలోని రాంగోపాల్‌ ‌వర్మ, మంచు విష్ణు(బంధువు)తన భార్యతో కలిసి రావడం జరిగింది. ఇక పార్టీకి చెందిన అభిమానులు, సానుభూతి పరులు మాత్రం కొందరు హాజరయ్యారు. ఇంతకు మించి చెప్పుకోదగ్గ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు హాజరు కాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంకు తెలుగుదేశం చిత్ర పరిశ్రమకు చెందిన వారందరూ హైదరాబాద్‌ ‌నుండి ప్రత్యేక విమానాల్లో అమరావతికి పోటీ పడి వెళ్లారు. చంద్రబాబు ను ప్రశంసలతో ముంచెత్తారు. కానీ,జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి విషయానికివచ్చే సరికి సీన్‌ ‌పూర్తిగా రివర్స్ అయింది. ఎన్నికల ఫలితాలు మొదలు ప్రమాణ స్వీకారం వరకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కనీసం విషెస్సిచెప్పిన దాఖలాలు లేవు. ఇదే విషయాన్ని థర్టీ ఇయ్యర్స్ ఇం‌డస్ట్రీ అని చెప్పే పృథ్వి బహిరంగంగానే లేవనెత్తారు. గతంలో సినీ ప్రముఖులు వ్యవరించిన తీరుకు…జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి విషయంలో చాలా తేడా ఉందని… జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డికి విషెస్‌ ‌చెప్పడానికి స్క్రిప్ట్ ‌కూడా దొరకడం లేదా?అంటూ..ఒకింత బాధను, అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ… తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ స్పందించ లేదు. జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ప్రమాణ స్వీకారంకు సంబంధించి ప్రభుత్వం నుండి, లేదంటే జగన్‌ ‌తరపున వ్యక్తిగత ఆవహనము వెళ్లిందా?లేదా?పిలిచినప్పటికీ కావాలని సినీ ప్రముఖులు హాజరు కాలేదా?అనేది ఇప్పుడు హాట్‌ ‌టాపిక్గా మారింది. అయితే, చిరంజీవి వంటి వారిని జగన్‌ ‌వ్యక్తిగతంగా పిలిచినా రాలేదు. ఏది ఏమైనా జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి పట్టాభిషేకంకు తెలుగు ఇండస్ట్రీ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రభావం రానున్న రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమపై ఎంతో కొంత ప్రభావం మాత్రం చూపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి!

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!