వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఛత్తీస్‌ఘఢ్‌లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

April 9, 2019

బిజెపి ఎమ్మెల్యే బీమా మాండవి, ఐదుగురు భద్రతాసిబ్బంది మృతిసరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో దంతెవాడ జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు.బిజెపి ఎమ్మెల్యే టార్గెట్‌ ‌చేసి హతమార్చిన సంఘటన మంగళవారం నాడు సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా నకులనాద్‌ ‌ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర అమర్చి అటుగా వస్తున్న బజెపి ఎమ్మెల్యే బీమామాండవి కాన్వాయిని పేల్చివేసారు. ఈ సంఘటనలో ఎమ్మల్యే మాండవి అక్కడిక్కడే మృతి చెందగా ఆయన భద్రత సిబ్బంది ఐదుగురు మృతి చెందారు. బిజెపి ప్రచారం నిర్వహించి తిరిగి ఆయన నివాసానికి సకులనాద్‌ ‌గ్రామం మీదుగా వెళ్తుండగా మావోయిస్టులు ఎమ్మెల్యేను టార్గెట్‌ ‌చేస్తూ మందుపాతర పేల్చారు. ఎమ్మెల్యేతో పాటూ ఐదుగురు భద్రత సిబ్బంది మృతదేహాలు తునాతునకలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న వాహనం కూడ మందుపాతర దాడికి నుజ్జునుజ్జు అయింది. ఎన్నికలు సమీపించడంతో ఈ సంఘటన చోటు చేసుకోగా ఛత్తీస్‌ఘఢ్‌ ‌ప్రాంతంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఇప్పటికే మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలంటూ వాల్‌ ‌పోస్టర్లు కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఈ దాడితో పోలీస్‌ ‌బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్‌ ‌బలగాలు మావోయిస్టులు ఈ ప్రాంతంలోనే ఉన్నారని ఉద్దేశ్యంతో అక్కడ ఉన్న అడవి ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. మృతి చెందిన వారిని దంతెవాడకు ప్రత్యేక హెలీక్యాఫ్టర్‌ ‌ద్వారా తరలించినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటువంటి సంఘటన జరుగటం పోలీస్‌ ఉన్నతాధికారులు మావోయిస్టులను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.