వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు మావోయిస్టులు మృతి

September 14, 2019

భారీగా ఆయుధాలు స్వాధీనంసరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో శనివారం నాడు మరోసారి తుపాకుల మోత మోగిందిలీ సంఘటనలో ఇద్దరు మావోయిస్టులు అక్కడిక్కడే మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కిరణ్‌డోల్‌ అటవీ ప్రాంతంలో పోలీస్‌ ‌బలగాలు కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదరు పడటంతో ఇరువురి మధ్య కాల్పులు జరిగాయి. అదే ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారంతో పోలీస్‌ ‌బలగాలు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు మావోయిస్టులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో లచ్చుమడివి మల్కాజ్‌గిరి ప్రాంతానికి వారుగా గుర్తించారు. ఇతనిపై లక్ష రూపాయలు రివార్డు ఉన్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ ‌పల్లవ్‌ ‌తెలిపారు. అలాగే పొడియ గుమియాపాల్‌ ‌కమాండర్‌గా పనిచేస్తున్నారు. ఇతనిపై కూడ లక్ష రూపాయలు రివార్డు ఎన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరివద్ద నుండి 9యంయం కిస్టల్‌, 12‌బోర్‌రైఫిల్స్, ‌మరియు బాంబులు అమరస్తున్న బకేట్‌, ‌మరియు మందుగుండు సామాన్లు స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.