Take a fresh look at your lifestyle.

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసిపి నర్సయ్య
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసిపి నర్సయ్య

రూ.2.30లక్షల సొత్తు స్వాధీనం : ఏసిపి నర్సయ్యతాగుడు, జల్సాలకు అల వాటు పడి తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడు తున్న నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2.30లక్షల విలువైన బంగారు, వెండి ఆభర ణాలను స్వాధీనం చేసుకు న్నట్లు వరంగల్‌ ఏసిపి జె.నర్సయ్య వెల్లడించారు. ఈమేరకు మంగ ళవారం ఇంతెజార్‌గంజ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వాధీనం చేసుకున్న ఆభరణాలను విలేకరుల ముందు ప్రదర్శించారు. ఈసందర్భంగా ఏసిపి నర్సయ్య మాట్లాడుతూ నిందితుడు వరంగల్‌ ‌గిర్మాజిపేట ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ‌తైసీన్‌(28) ‌బైక్‌ ‌వాటర్‌ ‌సర్వీసింగ్‌ ‌చేసుకుంటూ డబ్బులు సరిపోక దొంగనాలు చేసి సులువుగా సంపాదించవచ్చని ఫిబ్రవరి 26న మధ్యరాత్రి చార్‌బౌళి ఏరియాలోని తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించాడన్నారు. ఆతర్వాత మరల మే 25న అదే చార్‌బౌళి ఏరియాలో జామ్‌ ‌జామ్‌ ‌మసీదు గల్లీలోని మరో ఇంట్లో వెండి, బంగారు ఆభరణాలు దొంగిలించి వాటిని ఇన్నిరోజులు తన ఇంట్లో దాచిపెట్టాడన్నారు. మంగళవారం ఉదయం వాటిని అమ్మేందుకు ఆర్‌ఎన్‌టి రోడ్‌లోని బంగారం షాపుల వద్దకు రాగా ఇంతెజార్‌ ‌గంజ్‌ ‌సిఐ సిహెచ్‌.శ్రీ‌ధర్‌, ఎస్‌ఐ ‌కె.అశోక్‌కుమార్‌లు తమ సిబ్బందితో కలిసి అనుమానాస్పదంగా ఉన్న తైసీన్‌ను పట్టుకొని విచారించగా పై రెండు నేరాలు చేసినట్లు ఒప్పుకోవడంతో అతని వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల్లో చంద్రహారం, నెక్లెస్‌, ‌కడెం, ఉంగరం, 2 జతల కమ్మలు, 3 చిన్న ఉంగరాలతో పాటు 40 తులాల వెండి పట్టీలు, కడాలు ఉన్నాయన్నారు. నిందితుడి నుంచి మొత్తం 7 తులాల 2 గ్రాముల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి నర్సయ్య వివరించారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకొని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న సిఐ, ఎస్‌ఐ, ‌పోలీసు సిబ్బందిని ఏసిపి నర్సయ్య అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో ఇంతెజార్‌గంజ్‌ ‌సిఐ సిహెచ్‌.శ్రీ‌ధర్‌, ఎస్‌ఐ ‌కె.అశోక్‌కుమార్‌, ‌హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌కె.రవీందర్‌ ‌రెడ్డి, కానిస్టేబుళ్లు రాంరెడ్డి, సంతోష్‌, ‌కుమార్‌, అలీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!