- అధికారులకు మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశం
- క్రషింగ్ తదితర సమస్యలపై సమీక్ష
చెరుకు రైతులకు ఎలాంటి నష్టం జరక్కుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జహీరాబాద్ చెరుకు రైతులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో జహీరాబాద్ చెరుకు రైతుల సమస్యలు, ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ చెల్లించాల్సిన బకాయిలు, ఈ సంవత్సరం క్రషింగ్‌కు సంసిద్ధత, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రైడెంట్ పరిశ్రమ యాజమాన్యంతో ఎప్పుడూ సమస్య వొస్తుందని, దాని ప్రభావం చెరుకు సాగుపై పడుతుందని అన్నారు. గత సంవత్సరం 1400 మంది రైతులకు రూ.12.70 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, గత నాలుగు నెలలుగా చాలాసార్లు యాజమాన్యంతో సమావేశమై మాట్లాడినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉందని అన్నారు. ఉ
కూడా జీతాలు ఇవ్వడం లేదని, బకాయిలు చెల్లించడం లేదని, క్రషింగ్ చేయడానికి కూడా సిద్ధంగా లేరన్నది స్పష్టమైందన్నారు. పరిశ్రమపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సంవత్సరం సాగులో ఉన్న మూడు లక్షల ఎకరాలలో ఉన్న చేరుకును ఏ విధంగా క్రషింగ్ చేయాలన్నది నిర్ణయం తీసుకుని రైతుల అంగీకారంతో అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు.