Take a fresh look at your lifestyle.

చీకటి కోణాల్లో.. దాగని సత్యాలు కావాలిపుడు

దేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి పొంతన లేదు. నిజాం నిరంకుశత్వం ఎదిరించి సాయుధ• పోరాటం చేసిన తెలంగాణ గడ్డ. అదే చైతన్యంతో  అదే పోరాట నేపధ్యంలో చివరి వరకు కొట్లాడి రాష్ట్రం సాధించుకున్న ఘనత ఇక్కడి ప్రజానీకం స్వంతం. ఆది నుండి ప్రజల ఆకాంక్షలు బలంగా ఉన్నా  దిగ జారి పోయిన నాయకులు తమ స్వీయ ప్రయోజనాల కోసం పదవులకు అమ్ముడు పోయి పార్టీల జెండాలు మార్చిన క్రమంలో  మద్యలో  కొంత విరామం ఏర్పడినా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తెలంగాణ సాధించుకున్నారు.


తెలంగాణ ఉద్యమాల చరిత్రలో ఒక రోజు.. సెప్టెంబర్‌ 17

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతర పరిణామాలు, పర్యవసానాలపై మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమ భాగస్వాములు సింహావ లోకనం చేయాల్సిన సమయం ఇది. దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమం అనంతరం రాష్ట్రం ఏర్పడి ఐదేళ్ళు గడిచి పోయాయి. రెండు ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కెసిఆర్‌ ‌సారధ్యం లోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజావిశ్వాసం పొంది అధికారం నిలుపు కుంది.

తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు 1969 నుండి 2014 వరకు అనేక మజిలీలలో. కుట్రలు, కుతంత్రాలు కోకొల్లలు. బెదిరించడం లేదంటే అణిచి వేయడం వీలుకాక పోతే పదవులు ఎర వేసి మచ్చిక చేసుకోవడం వంటి వ్యూహాలతో అన్ని ప్రయోగాలు అమలు చేసారు.

కమిషన్లు, కమిటీలు ఏర్పాటు చేసి కాలయాపన  చేసే యత్నాలు జరిగాయి. పదవులు  పాకేజీలు  అన్నారు. ప్రజలు తమకు తెలంగాణ రాష్ట్రం మినహా మరేది ఆమోద యోగ్యం కాదని తేల్చి చెప్పారు.  స్వరాష్ట్ర సాదన కోసం ప్రాణాలను త్యజించారు. ఉద్యమం శాంతి యుతంగానే జరిగినా 1969 తొలి విడత 1996 లో ప్రారంభమైన  తుది విడత ఉద్యమంలో హింసను ప్రేరేపించింది  పాలకులనే చెప్పు కోవాలి. శాంతి భద్రతల సమస్యగా చిత్రించే యత్నంలో తీవ్ర మైన అణిచి వేతకు పాల్పడ్డారు. విద్యార్థులు, యువకులు అనేక మందిని అక్రమ కేసులలో ఇరికించి జైళ్ల పాలు చేసారు. తీవ్ర చిత్ర హింసల పాలు చేసారు. కాల్చిచంపారు. తుది విడత ఉద్యమ సమయంలో కూడ ఈ పద్దతులే అనుసరించారు. విద్యార్థులు, యువకులపై వందల కేసులు నమోదు చేశారు.

కాకతీయ యూనివర్శిటి పరిశోదనా విద్యార్థి యకూబ్‌ ‌రెడ్డిని మరి కొందరు విద్యార్థులను రోజుల తరబడి పోలీస్‌ ‌స్టేషన్లు తిప్పి హింసించారు.  అయినా ఉద్యమకారులు ప్రాణాలకు తెగించి పోరాడారు. శ్రీకాంతాచారి, యాదయ్య, కిష్టయ్యలతోపాటు వేయికి పైగా ఉద్యమ కారుల బలిదానాలు జరిగాయి. తెలంగాణ కోసం జరిగిన త్యాగాలకు లెక్క లేదు విలువ లేదు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సముచిత గౌరవం కూడ బలిదాణాలు చేసిన కుటుంబాలకు దక్కలేదు. తొలి విడత తుది విడత ఉద్యమ కారులను కనీసం గుర్తించేందుకు కూడ తెలంగాణ సర్కార్‌ ‌సిద్దంగా లేదు.  నష్ట పోయింది. ప్రజలైతే ఫలితాలు పదవులు అనుభవిస్తున్నది మాత్రం నాయకులు. అది కూడ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసి తెలంగాణ వాదులను తరిమి కొట్టిన  వలస వాదుల తాబేదార్లు.

ఈ చర్చంతా ఇప్పడు తెలంగాణ లో జరగాలి. చరిత్ర లో దాగిన చీకటి కోణాలు  అన్ని వెలుగు లోకి రావాలి.
ఆనాడు రాజకీయ ప్రక్రియ పేరిట కేవలం వోట్లు సీట్ల యావతోనే కాలం గడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాయ మాటలతో  మభ్యపెట్టిన నేతల బండారం కూడ పయట పెట్టాలి. తెలంగాణ ప్రజలు చరిత్ర నిర్మాతలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తమ కర్తవ్యం పూర్తి కాలేదు. సమగ్ర మైన చరిత్ర నిర్మించాలంటే మరుగున పడిన కథలన్ని బయటికి రావాలి.

‘‘ ఇతిహాసపు చీకటి కోణం, దాచేస్తే దాగని సత్యం, అట్టడుగున పడి కాన్పించని కథలన్ని కావాలిపుడు’’ అన్నాడు. మహా కవి శ్రీ శ్రీ.
సెంట్రల్‌ అడ్మినిస్ట్రేట్‌ ‌ట్రిబ్యునల్‌ ‌చైర్మన్‌ ‌పట్నా హైకోర్టు విశ్రాంత  ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఎల్‌. ‌నర్సింహారెడ్డి మాజి గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. ‌నరసింహన్‌ ‌వ్యవహరించిన నిరంకుశ విధానాలను ఎత్తి చూపడం చర్చ నీయాంశమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ‌నరసింహారెడ్డి ఎదుట గవర్నర్‌ ‌నరసింహన్‌ ఎట్లా మనసులో ఉన్న  అక్కసు వెల్లగక్కాడో వివరించారు.ఉద్యమ సమయంలో ఉస్మానియా
విద్యార్థులను పోలీసులు వేధించి హింసించిన సందర్భంగా అదే సమయంలో ఓ జర్నలిస్టు మోటార్‌ ‌బైకుపై మూత్ర విసర్జన చేయాల్సిందిగా ఓ పోలీసు అధికారి ఆదేశించినట్లు మీడియాలో వచ్చిన కథనాలకు సంభందించిన రిట్‌ ‌పిటిషన్‌ ‌పరిశీలనకు రాగా తాను ఆ పోలీస్‌ అధికారికి సమన్లు పంపించానని సందర్బం చెప్పు కొచ్చారు. అదే సమయంలో కేసు విచారణ సందర్భంగా ఆ పోలీస్‌ అధికారి చర్యలను తప్పు పట్టగా క్షమాపణలు చెప్పాడని జస్టిస్‌ ‌నరసింహారెడ్డి వివరించారు.

ఆ తర్వాత ఓ సందర్బంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ ‌నరసింహన్‌ ‌ను  రాజ్‌ ‌భవన్‌ ‌లో కల్సిన సమయంలో ఇద్దరి మద్య ముఖాముఖిగా జరిగిన సంభాషణ వివరించారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో 2010 జవవరిలో వర్నర్‌ ‌గా  వచ్చిన తర్వాత ఉద్యమ అణిచివేత చర్యల కోసం రాజ్‌ ‌భవన్‌ ‌నుండి నేరుగా ఎట్లా ఆదేశాలు జారి అయ్యాయో గుర్తు చేశారు, నరహింహన్‌ ‌ను నియమించడం వెనకు ఓ కుట్ర కోణం  లేదను కోలేం. కెసిఆర్‌ ‌దీక్ష దరిమిలా ఆనాటి హోం మంత్రి చిదంబరం 2009 డిసెంబర్‌  9 ‌న తెలంగాణ ప్రకటించి ఆ వెంటనే వెనక్కి తగ్గడం వెనక కూడ ఓ పెద్ద కుట్ర జరిగింది. వందలాది మంది యువకులు విద్యార్థుల బలిదానాలకు దారి తీసింది. అణిచి వేత విధానంతో ఘర్షణ రెచ్చ గొట్టే రీతిలో వ్యవహరించడం వల్లే అమాయక విద్యార్థులు, యువకుల బలిదానాలకు దారి తీసిందని జస్టిస్‌ ‌నరసింహా రెడ్డి ఆవేదన చెందడం వెనక ఆయన మనసు తల్లడిల్లిన తీరును ఆర్దం చేసుకోవాలి.  ఓ బాధ్యత గల పౌరుడిగా అందులోను రాజ్యాంగ పరిరక్షణ పదవిలో ఉవ్న సమయంలో ఆయన పరిశీలనకు వచ్చిన అంశాలు కాగా ఇప్పుడు వెల్లడించేందుకు సమయం సంద•ర్భం ఏదైనా కావచ్చు కాని ఇలాంటి అనేక కుట్రలు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగాయనేది తెలంగాణ వాదులు ఎరిగిన సత్యం. 2010 లో ఏర్పడిన  జస్టిస్‌ ‌శ్రీకృష్ణ కమిటి ఎలాంటి నివేదిక ఇచ్చిందో  తెలంగాణ ప్రజలకు తెల్సు.  తెలంగాణ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా భావించి అణిచి వేయవచ్చని ఈ కమిటి తన పరిష్కార మార్గాలలో పేర్కొంది. సీల్డు కవర్లో పెట్టి మరో చీకటి అధ్యాయానికి తెర లేపాలని చూసింది. సీల్డ్ ‌కవర్‌ ‌భాగోతం సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌నల్సార్‌ ‌న్యాయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు మాడభూషి శ్రీధర్‌ ‌వెలుగులోకి తెచ్చారు. వాస్తవంగా కమిటి నామమాత్రంగా ప్రజాభిప్రాయం చేసిందే తప్ప తెలంగాణ ప్రజల ప్రగాఢ• ఆకాంక్షను పరిగణన లోకి తీసుకోలేదు. రిపోర్టు అంతా రాష్ట్రాన్ని విడగొట్ట వద్దని  ఆనాటి అధికారుల చేత చెప్పించిన  వాంగ్మూలాల పత్రాలను జోడించి  ప్రభుత్వానికి అనుకూలమైన రిపోర్టు ఇచ్చేందుకు జస్టిస్‌ ‌శ్రీకృష్ణ కమిటి ఎంతో కష్ట పడి అభాసు పాలైంది. తెలంగాణ ప్రజల పోరాట స్పూర్తి ముందు యుపిఏ సర్కార్‌ ‌దిగి రాక తప్ప లేదు. నివేదికను బుట్టదాఖలా చేసి చివరికి తెలంగాణ ఇవ్వక తప్పలేదు. అయితే ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా కాలయాపన చేసినందుకు ఫలితం అనుభవించాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ ‌పార్టి ఇటు తెలంగాణ లోను ఆటు ఆంధ్రలోను రెండు విధాలుగా నష్ట పోయింది..
రాష్ట్ర గవర్నర్‌ ‌నరసింహన్‌ ‌తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకే నియమితులైన ఓ మాజి పోలీస్‌ అధికారి. ఎందుకంటే ఆయన వైఖరి మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకమే.  ప్రజా ఉద్యమాన్ని అణిచి వేసేందుకు గవర్నర్‌ ‌పేరిట వచ్చిన ఓ ‘డయ్యర్‌’ ‌లాంటి వాడు. గవర్నర్‌ ‌కేంద్రానికి రాష్ట్రానికి రాజ్యాంగ బద్ద పరిరక్షకుడిగా ఉండాల్సింది  పోయి పాలక పార్టీలకు ఏజెంటుగా పనిచేశాడు. నరసింహన్‌ ‌మాజి పోలీస్‌ అధికారి కనుక తెలంగాణ ఉద్యమాన్ని పోలీసు పంథాలో అణిచి వేసి పాలకుల ప్రశంసలు పొందాలని  ఆశ పడి ఉండవచ్చు. కాని తెలంగాణ ప్రజల ధృడ సంకల్పం ముందు ఒక్క నరసింహన్‌ ఏమిటి అనేక మంది నరహింసలు పెట్టిన వారి మఖాలన్ని వాడి పోయాయి.
యూపిఏ ప్రభుత్వంలో నియమితులై ఎన్‌ ‌డిఏ సర్కార్‌ ‌వచ్చిన తర్వాత కూడ కేంద్రానికి నచ్చిన వ్యక్తిగా 9 సంతవ్సరాల 9 నెలల సుదీర్ఘ కాలం వరకు నరసింహన్‌ ‌కొన సాగ గలిగారంటే ఆయన ఆయన ఫ్రభు భక్తి ఏపాటిదో అర్దం చేసుకోవచ్చు. కెసిఆర్‌ ‌కు దగ్గరైన నరసింహన్‌ ఏపి మాజి సిఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్య చిచ్చు పెట్టాడని విశ్లేషకుల అభిప్రాయం.

తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన బలిదానాలపై ఏనాడూ ఈ అభినయ డయ్యర్‌ ‌చలించక పోవడం చూస్తే ఆయన నృసింహావతారం ఎవరి కోసమో అర్దం అవుతుంది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం తప్ప నిలబెట్టడం ఇలాంటి  వ్యక్తులకు గిట్టదు. అందుకే రాజ్యాంగం ముసుగులో రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా ఇలాంటి వారిని ఏరి కొరి తెచ్చుకుంటారు. నరసింహన్‌ ఏది ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. పార్టీ ఫిరాయించిన వారి చేత ఏ రాజ్యాంగ ప్రమాణాల మేరకు ఆయన హయాంలో ప్రమాణ స్వీకారం చేయించారో తెలియదు. ఇలాంటి వ్యక్తితో ఎడబాటును తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌తట్టుకోలేక పోయారు. ఎందుకంటే కెసిఆర్‌ ‌ను ఆయన కుటుంబాన్ని మాజి గవర్నర్‌ ‌నరసింహన్‌ ‌పలు సందర్భాలలో  వెనుకేసుకొచ్చాడు కనుక.
ప్రజలు ఎలాంటి తెలంగాణ కోరుకున్నారు.? దోపిడి దౌర్జన్యాలు లేని ఆకలి బాధ•లు ఆత్మహత్యలు లేని హక్కులకు భంగం వాటిల్లని తెలంగాణ కావాలని కోరుకుంటే ఇప్పుడు వారికి దక్కిందేమిటో విశ్లేషణ జరగాలి. నక్సలైట్ల ఎజెండానే నా జెండా అని ప్రకటించి హక్కుల ఉద్యమానికి నాయకుడి అవుతానంటూ ప్రకటించిన నేత ప్రస్తుతం తన ఏలు బడిలో ఏ మేరకు హక్కులను గౌరవిస్తున్నాడో కనీస భావ ప్రకటన స్వేఛ్చ కూడ లేకుండా ఎట్లా హక్కులు కాల రాసాడో చర్చ జరగాలి.

దేశంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి పొంతన లేదు. నిజాం నిరంకుశత్వం ఎదిరించి సాయుధ• పోరాటం చేసిన తెలంగాణ గడ్డ. అదే చైతన్యంతో  అదే పోరాట నేపధ్యంలో చివరి వరకు కొట్లాడి రాష్ట్రం సాధించుకున్న ఘనత ఇక్కడి ప్రజానీకం స్వంతం. ఆది నుండి ప్రజల ఆకాంక్షలు బలంగా ఉన్నా  దిగ జారి పోయిన నాయకులు తమ స్వీయ ప్రయోజనాల కోసం పదవులకు అమ్ముడు పోయి పార్టీల జెండాలు మార్చిన క్రమంలో  మద్యలో  కొంత విరామం ఏర్పడినా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తెలంగాణ సాధించుకున్నారు.

పపంచంలో ఎక్కడా జరగని రీతిలో స్వీయ అస్తిత్వం కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమానికి  యాజమాన్య సంస్థలు, యజమానులు లేరు. ప్రజా ఉద్యమానికి ప్రజలే యజమానులు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలే ఈ ఉద్యమానికి నాయకులు సర్వ హక్కు భుక్తములు కలిగిన వారు ప్రజలే. కాని సంస్థలు,, వ్యక్తులు ఎవరు క్లైమ్‌ ‌చేసుకున్నా వారికి వారే ఆపహాస్యం చేసుకున్న వారవుతారు.తెలంగాణ సాదనలో రాజకీయ ప్రక్రియ కీలకమే కావచ్చు. కాని అందుకు తమకే పేటెంట్‌ ‌రైట్స్ ఉన్నాయని చెప్పుకుని తెలంగాణను ఆగం చేసే నేతల భరతం పట్టాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమ సమయం నుండే ఇలాంటి శక్తులు ఓ హిడ్డెన్‌ ఎజెండాతో  వ్యవహరించి ప్రజా ఉద్యమంలో దూరి పోయి తెలంగాణ ప్రజలను  వంచించారు. ఉద్యమంలో ఎవరి పాత్ర ఏమిటో ఎవరి చీకటి కోణాలు ఏమిటో వెలికి తీయాల్సిన అవసరం ఉంది.

ధృడమైన ప్రజల ఆకాంక్షలు పసిగట్టిన పిదప కాని ఎక్కడ చెల్లని నాణేలుగా మిగిలి పోవాల్సి  వస్తుందనే  భయంతో రాజకీయ పార్టీలు, వ్యక్తులు ప్రజా ఉద్యమంలో  చేరిపోక తప్పలేదు. కాక పోతే ఉద్యమంలో కొందరు రాజకీయ నేతలు  ముందు రావచ్చు కొందరు వెనక రావచ్చు. మొత్తానికి తమ తమ స్వీయ రాజకీయ ఆస్తిత్వం కోసమే గుంపులో గోవిందా అన్నట్లు గొర్ల మందలో తోడేళ్ల లెక్కన  కల్సి పోయారు. ఉద్యమ కారులు ప్రస్తుతం ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఆనాడు సీమాంధ్ర నాయకుల ఎంగిలి మెతుకులు తిన్న విశ్వాసంతో ఉద్యమాకారులను ఉరికించి కొట్టిన వారు ఇప్పుడు   అధికారం అనుభవిస్తున్నారు, అలాంటి వారిని చూస్తుంటే తెలంగాణ వాదులు సహించి ఉండ లేక పోతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కాని  తోడేళ్ల అసలు రూపం బయట పడింది కాదు. వీరి నిజస్వరూపాలు ప్రజలకు అర్దం  అయ్యే సరికే జరగాల్సిన అనర్దాలు, నష్టాలు చాలా జరిగి పోయాయి. కనీస ప్రజాస్వామ్య హక్కులు కూడ లేకుండా తెలంగాణ పాలక ప్రభువులు కొనసాగిస్తున్న  పాలన విమర్శల పాలవుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు గడిచి పోయింది. తొమ్మిది మాసాలకు ముందే మద్యంతర ఎన్నికలకు వెళ్ళిన కెసిఆర్‌ ‌రెండో సారి ముఖ్య మంత్రి అయ్యారు. ఆయన ఇచ్చిన అనేక హామీలు చేసిన వాగ్దానాలు ఏవి నెర వేరలేదు. అంతటా అసంతృప్తులు చోటు చేసుకున్న పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెల కొన్నాయి. మిగులు బడ్జెట్‌ ‌తో ఏర్పడిన రాష్ట్రన్ని అప్పుల పాలు చేశారు.

ఎక్కడ గతి తప్పామో ఎవరు గురి తప్పించారో అన్వేషణ జరిగి తీరాలి. అందుకే దగాపడ్డ  చరిత్రను తిరగ దోడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఓ స్తబ్తత నెల కొంది. పాలకుల మాటలు నమ్మి కొంత సమయం ఇవ్వాలనో లేక ప్రజా కవి కాళోజి చెప్పినట్లు  అదను కోసం కాచుకుని సమయం వచ్చినపుడు కాటేయాలనో కాని చదువుకున్న మేధావులు మొదలు  సామాన్యుల వరకు ఎందుకో మౌనం వహిస్తున్నారు. ఈ మౌనానికి ఎక్కడో ఓ దగ్గర  బ్రేక్‌ అనేది జరగాలి. జరుగుతుందని ఆశిద్దాం. ఆదిశగా పయనిద్దాం

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy