Take a fresh look at your lifestyle.

చివరి నిమిషం.. సాంకేతిక లోపం..!

కంటతడిపెట్టిన ఇస్రో ఛైర్మన్‌ ‌శివన్‌ను హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోడీ.
కంటతడిపెట్టిన ఇస్రో ఛైర్మన్‌ ‌శివన్‌ను హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోడీ.

చంద్రుడికి 2.1కి. దూరంలో నిలిచిపోయిన చంద్రయాన్‌ -2 ‌సంకేతాలు
కన్నీరు పెట్టుకున్న ఇస్రో చైర్మన్‌ ‌శివన్‌ – ఓదార్చిన ప్రధాని నరేంద్ర మోదీ
ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసిస్తున్న యావత్‌ ‌భారతం
130 కోట్ల మంది భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 ‌చివరి నిమిషంలో గతితప్పింది. తన 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడిపై సజావుగా దిగుతున్న విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌నుంచి భూకేంద్రానికి ఒక్కసారిగా సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న యావత్తు ప్రపంచ నిరాశకు గురైంది. అంతకు ముందు గంటకు 6వేల కిలోటర్ల వేగంతో ప్రయాణించిన ల్యాండర్‌ ‌విక్రమ్‌ ‌చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి 15నిమిషాల ముందు తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంది. శనివారం తెల్లవారుజామున సరిగ్గా 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలంపై దింపేందుకు’విక్రమ్‌’ ‌ల్యాండర్‌కు శాస్త్రవేత్తలు సంకేతాలు పంపారు. అంతా సవ్యంగా ఉందని నిర్ణయానికి వచ్చిన శాస్త్రవేత్తలు.. 78 సెకెన్ల అనంతరం సంకేతాలు పంపుతూ ల్యాండర్‌ను ఉపరితలంపై దింపారు. ఈ సమయంలో ల్యాండర్‌లోని థ్రాటుల్‌ ఏబుల్‌ ఇం‌జిన్లు పనిచేయడం ఆరంభించి, దాని
గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ వ్యోమనౌక వేగాన్ని తగ్గించాయి. అనంతరం ల్యాండర్‌ ‌కిందకు దిగడం మొదలయింది. చంద్రుడికి 2.1 కిలోటర్ల వరకు ల్యాండర్‌ ‌ప్రయాణం సవ్యంగా సాగింది. సరిగ్గా ఇక్కడ నుంచే సంకేతాలు నిలిచిపోయాయి. విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌ప్రయాణం 2.1 కిలోటర్ల ఎత్తువరకు సజావుగా సాగిందని, తర్వాతే సంకేతాలు నిలిచిపోయినట్టు ఇస్రో ఛైర్మన్‌ ‌కే శివన్‌ ‌వెల్లడించారు. లోపాలకు గల కారణాలను విశ్లేషిస్తామని ఆయన తెలిపారు. కాగా డియా ఇస్రో శాస్త్రవేత్తలను… విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌క్రాష్‌ అయ్యిందా? అని ప్రశ్నించగా, ఇంతవరకూ దీనికి సంబంధించిన రిజల్ట్ ‌తమకు అందలేదని, ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. దీనిని తాము నిర్దారించలేమన్నారు.
ఇస్రో చైర్మన్‌ను హత్తుకొని ఓదార్చిన ప్రధాని మోదీ..
చంద్రయాన్‌-2 అత్యంత కీలకమైన ప్రాజెక్టు. మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రరాజ్యాలకు దీటుగా అంతరిక్షంలో పోటీపడాలని ఇస్రో సంకల్పించింది. అయితే అదంత సులవుకాదని విషయం ఇస్రోకు ముందే తెలుసు. రాకెట్‌ ‌ప్రయోగించడం, చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వరకూ అంతా సాఫీగా సాగిపోయాయి కానీ ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలం దకు క్షేమంగా దింపడమే అసలు సిసలైన పరీక్ష. గతంలో అనేక ప్రయోగాలు అక్కడే ఆగిపోయాయి. ఆరు వేల కిలోటర్లకుపైగా ప్రయాణిస్తోన్న ల్యాండర్‌ ‌వేగాన్ని అమాంతం తగ్గించి సురక్షితంగా దక్షిణ ధృవం దకు దింపడమంటే ఆషామాషీ కాదు. మన చంద్రయాన్‌-2 ‌కూడా కిలోటర్ల ఎత్తుదాకా అనుకున్నట్టుగానే పయనించి, అక్కడే నిరాసపర్చింది. ల్యాండర్‌ ‌విక్రమ్‌ ‌చివరి క్షణాల్లో చంద్రుడిపై ముద్ర వేయలేకపోవడంతో ఇస్రో కేంద్రం మొత్తం దాదాపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎన్నో ఏళ్ల శ్రమ, ఖర్చు, నిరీక్షణ, ప్రయత్నం అన్నీ ఆ చివరి క్షణాల్లో దూరమయ్యాయి. మరోవైపు, చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ ‌దిగే ఘట్టాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో విజయం అందుకుంటారనే నమ్మకం తనకుందని మోదీ వ్యాఖ్యానించారు. జీవితంలోని ప్రతి పక్రియలో జయాపజయాలు సాధారణమని, రు సాధించింది తక్కువేం కాదని.. అపజయం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో ఆశావాద దృక్పథంతో సాగుదామని, దేశం యావత్తు వెనుక ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. తన కాన్వాయ్‌ ఎక్కేసి, వెళ్లిపోతుండగా వీడ్కోలు చెప్పటానికి శివన్‌ ‌గేటు దాకా వచ్చారు. ఆయనకు దుఖం తన్నుకురాగా కళ్లల్లో నీళ్లు చూసిన మోదీ కూడా చలించి, హత్తుకున్నాడు. కాసేపు అలాగే శివన్‌ ‌వెన్నుతడుతూ ఊరడించారు. అక్కడున్న అందరిలోనూ ఓ ఉద్విగ్నత చోటుచేసుకుంది. శివన్‌కు ఓ ఉపశమనం ప్రధాని రూపంలో దక్కింది. ఈ దృశ్యాలు నిజంగానే అందరినీ కదిలించాయి. వైఫల్యం చీకట్లో ప్రధాని ఇస్రో వెంట నిలబడ్డ తీరు అభినందనీయం. సోషల్‌ ‌డియా కూడా ఈవిషయంలో ఇస్రోకు బాసటగా నిలవడం విశేషం.ఇదిలా ఉంటే చంద్రుడిపై దిగడానికి ఇస్రో చేసిన ప్రయత్నం పూర్తిగా ఫలించనప్పటికి అది అపజయం మాత్రం పొందలేదని, ఏడాది కాలవ్యవధితో పనిచేసే చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌ ‌చంద్రుడిని అధ్యయనం చేసే తన పనిని నిర్విఘ్నంగా కొనసాగించనుందని, మిషన్‌లో విక్రమ్‌ ‌ల్యాండర్‌, ‌ప్రజ్ఞాన్‌ ‌రోవర్‌ 5 ‌శాతంగా ఉన్న భాగాన్నే కోల్పోయినట్లు.. మిగిలిన 95 శాతం చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌ ‌తన పనిని విజయవంతంగా కొనసాగించనున్నట్లు ఇస్రోకు చెందిన ఓ అధికారి సీనియర్‌ ‌శాస్త్రవేత్త ఓ న్యూస్‌ ఏజెన్సీతో పేర్కొన్నారు. వచ్చే ఏడాది కాలం వరకు చందమామ పలు చిత్రాలను తీసి ఆర్బిటర్‌ ఇ‌స్రోకు పంపనుందని, అదేవిధంగా మిస్సైన ల్యాండర్‌ ‌చిత్రాలను సైతం తీసి దాని ప్రస్తుత పరిస్థితిని కూడా పంపించనుందని తెలిపారు.
ఇస్రో కృషి సాహసోపేతం : రాష్ట్రపతి రామ్‌నాథ్‌
‌చంద్రయాన్‌-2 ‌ప్రయోగం ద్వారా ఇస్రో బృందం శ్రేష్ఠమైన పనితీరును కనబరిచిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ అన్నారు. చంద్రుడికి అతిసపంలోకి వెళ్లిన ల్యాండర్‌ ‌నుంచి సంకేతాల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. చంద్రుడికి 2.1 కిలోటర్ల దూరం వరకు సవ్యంగా సాగిన ల్యాండర్‌ ‌ప్రయాణం.. అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోయాయి. దీనిపై ట్విట్టర్‌ ‌ద్వారా రాష్ట్రపతి తన స్పందనను తెలియజేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు అంకితభావం, సాహసోపేతమైన కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్‌లో సంపూర్ణ విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.
శ్రమ వృథాకాదు : ఇస్రో శాస్త్రవేత్తలకు రాహుల్‌ ‌ట్వీట్‌
‌చంద్రయాన్‌-2 ‌ప్రయోగం చివరి ఘట్టంలో విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌నుంచి సంకేతాలు అందకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు లోనయ్యారు. ఈ నేపధ్యంలో శాస్త్రవేత్తల్లో నెలకొన్న నిరాశను తొలగించేందుకు పలువురు వారికి భరోసాను అందిస్తున్నారు. కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చంద్రయాన్‌-2 ‌ప్రయోగంపై స్పందించారు. ఈ ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఇది ప్రత్యేకంగా భారత్‌కు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. తన ట్వీట్‌లో రాహుల్‌ ’‌చంద్రయాన్‌-2 ‌ప్రయోగంలో భాగస్వామ్యం వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇది భారతీయులకు ప్రేరణగా నిలుస్తుంది. రు పడిన శ్రమ వృథా కాదు. ఇది అంతరిక్షంలో చేయాల్సిన ప్రయోగాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy