వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

చిదంబరానికి బెయిల్‌

December 4, 2019

ఐఎన్‌ఎక్స్ ‌డియా కేసులో కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి. చిదంబరానికి బెయిల్‌ ‌మంజూరు అయింది. రూ. 2 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు పై చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్‌ ‌మంజూరు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇదిలాఉంటే సాక్ష్యాల్ని ప్రభావితం చేసే ఎటువంటి చర్యలకు పాల్పడొద్దని ఆదేశించింది. డియా సంస్థలకు ముఖాముఖిలుగానీ, బహిరంగ ప్రకటనలుగానీ చేయొద్దని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని ఆదేశించారు. జస్టిస్‌ ఆర్‌ ‌భానుమతి, ఏఎస్‌ ‌బోపన్న, హృషికేశ్‌ ‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పుని వెలువరించింది. ఆగస్టు 21న ఆయన్ని సీబీఐ అనేక నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అక్టోబర్‌ 16‌న కోర్టు ఆదేశాల మేరకు ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. దీంతో 106 రోజులుగా ఆయన జుడిషియల్‌ ‌రిమాండ్‌లోనే ఉన్నారు. అయితే అక్రమ లావాదేవీలపై సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు అక్టోబర్‌ 21‌న బెయిల్‌ ‌లభించిన విషయం తెలిసిందే. కానీ, ఈడీ అదుపులో ఉండడంతో బయటకు రాలేకపోయారు. తాజాగా ఈడీ కేసులోనూ ఊరట లభించడంతో ఆయన జైలు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమమైంది. ఈ కేసులో తనకు బెయిల్‌ ‌మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. నవంబరు 15న కోర్టు తిరస్కరించింది.