కుప్పంలో ఓటమికి సాకులు వెతుకుతున్నారు: బొత్స
చంద్రబాబు ఆడలేక మ్దదెల ఓడు అన్న రీతిలో మాట్లాడుతున్నాడని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో టీడీపీ కాదు ప్రజాస్వామ్యం ఓడిపోయింది అనడం చంద్రబాబుకే చెల్లిందని ఆయన విమర్శించారు. మా నాయకుడు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే కుప్పంలో ఈ విజయం సాధ్యమైందని ఆయన అన్నారు. అలానే కుప్పంలో ఎక్కడ రిగ్గింగ్ జరిగిందో చంద్రబాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
కౌంటింగ్ అక్రమాలు అంటున్నాడు..రీకౌంటింగ్ ఎందుకు కోరలేదు..? అని ప్రశ్నించిన ఆయన ఉత్తరాంధ్రలో, ఏజెన్సీలో కూడా గెలిచామని చెప్తున్న చంద్రబాబు ఎక్కడ గెలిచాడో నిరూపించాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ గెలవలేదని పేర్కొన్న ఆయన విశాఖ స్టీల్ ఎ•-లాంట్ విషయంలో సీఎం చెప్పిన సలహాలను తప్పు పడుతున్నాడని అన్నారు. నీ హయాంలోనే కదా ప్రయివేటీ కరణకు అంకురార్పణ జరిగిందని, అప్పుడేందుకు నువ్వు మాట్లాడలేదు..కనీసం ఇప్పుడైనా కేంద్రానికి లేఖ రాసే ధైర్యం ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడం చంద్రబాబుకు ఇష్టం అని అందుకే ఆయన హయాంలో దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు కూడా అదే నాటకాలు అడుతున్నాడని ఆయన విమర్శించారు.