వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురి మృతి

September 19, 2019

ఒకరి పరిస్థితి విషమం…
ఆనంద వేళలో ఊహించని మృత్యువు…
లండన్‌కు సాగనంపి కానరాని లోకాలకు…
ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురి మృతి, ఒకరి పరిస్థితి విషమం…ఆనంద వేళలో ఊహించని మృత్యువు…లండన్‌కు సాగనంపి కానరాని లోకాలకు…ఆర్తనాదాలతో ఆసుపత్రి దద్దరిల్లింది. ఘోర రోడ్డు ప్రమాదం ఊహించని విధంగా జరిగిన సంఘటన గురువారం ఉదయం 8 గంటలకు జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ‌సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్‌ ‌జిల్లా కేంద్రంలోని కొత్తబజార్‌లో నివాసం ఉంటున్న పెనుగొండ గణేష్‌(52) ఆయన భార్య సుకన్య(42), పెనుగొండ శ్రీలత(43), డ్రైవర్‌ ఎం‌డీ నజీర్‌ (52) ‌మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న మంజుష పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి వారు. తల్లిదండ్రులను కోల్పోయిన కూతురు గాయత్రి, తల్లిని పోగొట్టుకున్న కూతురు ప్రణవి ఆర్తనాదాలు జనగామ ఏరియా ఆసుపత్రిలో మారుమోగాయి. వారిని దు:ఖం నుండి ఆపేవారు ఎవరు లేకపోయారు. మృతుని అన్నయ్య సదాశివుని కుమారుడు సాయిశంకర్‌ ఎమ్మెస్సీ చదువుకునేందుకు లండన్‌ ‌వెళ్లేందుకు బుధవారం రాత్రి శంషాభాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఆయనను ఫ్లైట్‌లో పంపించి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌నుండి జనగామ జిల్లా మీదుగా మహబూబాబాద్‌ ‌జిల్లాకు వెళ్తున్న తరుణంలో దేవరుప్పుల పోలీస్‌ ‌స్టేషన్‌ ‌సమీపంలో లారీని ఓవర్‌టేక్‌ ‌చేస్తూ జనగామ వైపు వస్తున్న డీసీఎం అతివేగంతో కారును ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందడం జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు యుద్ద ప్రాతిపధికన సంబంధిత అధికారులకు మెరుగైన వైద్య సేవలు అందించి మంజుషను కాపాడాలని ఆదేశించారు. అంతేగాకుండా మహబూబాబాద్‌ ‌జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మృతుల బంధువులకు సెల్‌ఫోన్‌ ‌ద్వారా తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఒకే రోడ్డు ప్రమాదంలో కుటుంబం నుండి ముగ్గురు మరణించడం మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం వారి బంధువుల ఆర్తనాదాలు ఆసుపత్రి అంతా మారుమోగాయి. చూపరులు సైతం కంట తడిపెట్టారు. సంతోషంగా అన్న కుమారుడిని ఉన్నత చదువుల కొరకు లండన్‌కు పంపించి ఊహించని విధంగా కానరాని లోకాలకు వెళ్లడం ఇదెక్కడి దురదృష్టకరమంటూ త)బాదుకుంటూ దు:ఖసాగరంలో మునిగిపోయారు. వారి కుటుంబం నుండి విదేశాలకు వెళ్తున్న సంతోషం తీరకముందే మృత్యువు రోడ్డు ప్రమాదంలో వచ్చి కబలించడం పట్ల పరువురు ఆవేధన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్‌ ‌యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించడం మరొకరిని వరంగల్‌ ఎం‌జీఎంకు చికిత్స నిమిత్తం తరలించగా మంజుషకు మరింత విషమంగా ఉండడంతో హైధరాబాద్‌లోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. వారితో ప్రయాణించకుండా మరోకారులో పెదనాన్న పెనుగొండ సదాశివునితోపాటు గాయత్రి, ప్రణవిలు వరంగల్‌ ‌కిట్స్ ‌కాలేజీలో ఇంజనీరింగ్‌ ‌చదువుతున్న తరుణంలో వారిని కాలేజిలో చేర్చేందుకు వెళ్లడం వల్ల ప్రమాదం నుండి తప్పిందని మృతుల బంధువులు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రం నుండి రెండు కార్లలో ఒకటి రోడ్డు ప్రమాదానికి గురైన కారు మహబూబాబాద్‌ ‌వైపు వెళ్లగా, మరొకటి విద్యార్థినులగు గాయత్రి, ప్రణవిలను కాలేజిలో వదిలేసేందుకు వెళ్తున్న అరగంట సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని కన్నీరుమున్నీరుగా విలపించడం కనిపించింది. ఏది ఏమైనా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జిల్లా ప్రజలు, జిల్లా యంత్రాంగం ఒకేసారి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నర్మెట సీఐ సంతోష్‌కుమార్‌, ‌దేవరుప్పుల ఎస్‌ఐలు, పోలీస్‌ ‌సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకుని యుద్ద ప్రాతిపధికన చర్యలు చేపట్టడం జరిగింది.