వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఘాటెక్కిన ఉల్లి ధరలు!

November 22, 2019

కిలో రూ.100.. బెంబేలెత్తిపోతున్న సామాన్య ప్రజలు

ఉల్లి కోస్తేనే కాదు.. ఇప్పుడు కొనాలన్నా కన్నీళ్ళు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఆకాశానికి నిచ్చేనేసినట్టు ఉల్లి ధర భారీగా పెరిగింది. వేసవి అనంతరం వర్షాభావం వల్ల పెరిగిందని భావించినా.. ఇప్పుడు వర్షాలు భారీగా పడ్డాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో చేతికి వచ్చిన ఉల్లి పంట నేలపాలైంది. దీంతో మళ్లీ ఉల్లిధరకు రెక్కలొచ్చాయి. శుక్రంవారం ఆల్‌టైమ్‌ ‌రికార్డుకు చేరిన ఉల్లి ధర.. క్వింటాలుకు రూ.10 వేలు పలుకుతోంది. •ల్‌ ‌సేల్‌ ‌మార్కెట్లోనే ఇలా ఉంటే.. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర వంద దాటిపోయింది. పెరిగిన ధరలతో ఉల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే వినియోగదారులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారు. గతేడాది ఇదే సమయంలో క్వింటాల్‌ ఉల్లి ధర 100 రూపాయలే పలికింది. అయితే.. ఈ ఏడాది పరిస్థితులు మారిపోయాయి. ధర తగ్గుతుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. మళ్ళీ అదే ధర ఇప్పుడు పలుకుతోంది. ఉల్లి లేకుండా కూరల్ని ఊహించలేం. అందుకే గృహిణులు ఉల్లి ధర పెరగగానే ఆందోళనకు గురవుతున్నారు. ఇటు •టళ్ళు, బిర్యానీ సెంటర్లు కూడా ఉల్లిని పక్కకు పెట్టేశాయి. ఉల్లి దోస కనిపించడంలేదు. బిర్యానీలో నిమ్మకాయతో పాటు ఉల్లిపాయ ముక్కలు ఇవ్వడం ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఉల్లి కావాలని అడగవద్దంటున్నారు •టళ్ళ యజమానులు. మహారాష్ట్ర, కర్నాటక రాష్టాల్ల్రో పండించే ఉల్లి దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలనే శాసిస్తోంది. ఉల్లి ధర భారీగా పెరగడంతో కొనలేక పోతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. ఇటీవల తెలుగు రాష్టాల్ల్రో ఉల్లి నిల్వలపై అధికారులు దాడులు చేశారు. నిల్వ ఉంచిన ఉల్లిని మార్కెట్‌లకు తరలించారు. దీనికితోడు ఏపీ ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణపై ప్రత్యేక ధృష్టిసారించింది. ఇతర రాష్టాల్ర నుంచి ఉల్లిని తెప్పించి మార్కెట్‌లలో విక్రయాలు చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేలా అనేక చర్యలు చేపట్టింది. అయినా ఉల్లిధరలు తగ్గలేదు. ఈ ఏడాది ఆగష్టు నుండి అక్టోబర్‌ ‌వరకూ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట బాగా దెబ్బతింది. ఈ ప్రభావంతో ఉల్లి పాయల ధర దేశవ్యాప్తంగా భారీగా పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉల్లి రైతులకు సిరులు కురిపిస్తోంది. దిగుబడి తక్కువైనా.. ధర ఉండటంతో పండిన పంటతో గిట్టుబాటు అయ్యిందని రైతులు సంతోషంతో ఉన్నారు. అయితే రైతులకు చెల్లించేది – వినియోగదారుల నుంచి వసూలు చేసే విషయంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో మధ్యదళారులు లాభపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో కంటే రైతు బజార్లలో కాస్త ధర తక్కువగా ఉండడంతో వినియోగదారులు క్యూల్లో నిలబడి మరీ ఉల్లిని కొంటున్నారు. మొత్తానికి తెలుగు రాష్టాల్ర ప్రజలను ఉల్లి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.