Take a fresh look at your lifestyle.

ఘనంగా శోభాయాత్ర

ఫోటో: గురువారం మద్యాహ్నం ఒంటిగంటకే ముగిసిన ఖైరతాబాద్‌ ‌గణేశుని నిమజ్జనం.
ఫోటో: గురువారం మద్యాహ్నం ఒంటిగంటకే ముగిసిన ఖైరతాబాద్‌ ‌గణేశుని నిమజ్జనం.

నిమజ్జనానికి భారీగా తరలివచ్చిన గణనాథులు
తిలకించిన లక్షలాది భక్తజనం
కోలాహలంగా మారిన ట్యాంక్‌ ‌బండ్‌ ‌పరిసర ప్రాంతాలు
పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుగురువారం హైదరాబాద్‌లో గణేష్‌ ‌నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న వినాయకుడు గంగ ఒడికి చేరాడు. నగర వ్యాప్తంగా లక్షలాది మంది జనం తరలివచ్చి గణపయ్యలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఊరేగింపులు, డప్పు చప్పుళ్లు, కోలాటాలు, డ్యాన్సులు, డీజే మోతల మధ్య శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఖైరతాబాద్‌ ‌గణేషుడి శోభాయాత్ర సందడిగా సాగింది. గురువారం ఉదయాన్నే 6 గంటలకు భారీ క్రేన్‌ ‌సాయంతో ట్రాలీపైకి ఎక్కించారు. చివరి పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. గతేడాది మాదిరిగానే ఖైరతాబాద్‌ ‌గణపతి నిమజ్జనం ముందుగా పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించడంతో ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రణాళిక రూపొదించారు. ఉదయం 7గంటల సమయంలో ఖైరతాబాద్‌ ‌నుంచి బయలుదేరి వినాయకుడు.. టెలిఫోన్‌ ‌భవన్‌, ‌తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, ‌సెక్రటేరియట్‌, ‌లుంబునీ పార్కు దుగా ఐదు గంటలపాటు శోభయాత్ర సాగింది. ట్యాంక్‌బండ్‌కు చేరిన మహాగణపతి నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక క్రేన్‌ ఏర్పాటు చేశారు. దీని సాయంతో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. విగ్రహానికి ఉన్న ఐరన్‌ ‌తొలగించిన తర్వాత క్రేన్‌నెం.6 వద్ద గంగమ్మ ఒడిలోకి గణనాథుడు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విగ్రహానికి సపంలో బారికేడ్లను ఏర్పాటుచేసిన పోలీసులు.. లోపలికి ఎవర్నీ అనుమతించ లేదు. విగ్రహానికి దూరంగానే భక్తులను నిలిపివేశారు. వినాయక నిమజ్జనం కోసం ఉపయోగించే ఆధునిక క్రేన్‌ను జర్మనీ టెక్నాలజీతో రూపొందించారు. రిమోట్‌ ‌కంట్రోలింగ్‌ ‌ద్వారా పనిచేసే ఈ క్రేన్‌.. ‌బరువును ఎత్తగానే ఎంత బరువు ఉంది, ఎంత దూరం ముందుకు తీసుకెళ్లగలదో చూపిస్తుంది. తద్వారా వాహనంపైకి చేర్చడం, నిమజ్జనం చేయడం సులువవుతుంది. ఈ వాహనం బరువు దాదాపు 72 టన్నులు. 400 టన్నుల మేర ఎత్తగల సామర్థ్యం ఉంటుంది. జాక్‌ 61 ‌టర్ల ఎత్తు వరకు లేపగలదు. పొడవు 14 టర్లు, వెడల్పు 4 టర్లు. 12 టైర్లు ఉన్నాయి. నిమజ్జనం చేసే హుస్సేన్‌సాగర్‌ ‌ప్రదేశంలో 20 అడుగుల మేర పూడికను తొలగించారు. ఆ ప్రాంతంలోనే గణపతిని నిమజ్జనం చేశారు.
నిమజ్జనంలో అపశ్రుతి.. కానిస్టేబుల్‌కు గాయాలు..
నగరంలోని పాతబస్తీలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహదూర్‌పుర పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో కిషన్‌బాగ్‌ ‌వద్ద గణనాథుడి విగ్రహాన్ని క్రేన్‌తో లారీలో పెట్టే సమయంలో ఓ పోలీస్‌ ‌క్రేన్‌పై నుండి క్రింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు హుటాహుటిన నాంపల్లి కేర్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన బహదూర్‌పుర పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవీందర్‌గా గుర్తించారు. కాగా మెరుగైన వైద్యసేవలు అందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌రావు వైద్యులకు సూచించారు.
కోలాహలంగా మారిన ట్యాంక్‌ ‌బండ్‌ ‌ప్రాంతం..
గణనాథుల నిమజ్జనాలతో ట్యాంక్‌ ‌బండ్‌ ‌ప్రాంతమంతా కోలాహలంగా మారింది. గ్రేటర్‌ ‌మహానగరంలో మొత్తం 55వేల విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో ఇప్పటికే అత్యధిక శాతం విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. కాగా గురువారం నిమజ్జనానికి చివరి రోజు కావటంతో పెద్ద మొత్తంలో విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. ఈ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ ‌పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్‌ ‌నిమజ్జనం ప్రశాంతంగా సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్ల పట్ల ప్రజలు, భక్తులు సంతోషంగా ఉన్నారని అన్నారు. గతంలో నిమజ్జనం అంటే రెండుమూడు రోజులు సీరియల్‌లో నిలబడినట్లుగా ఉండేదని కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత నిర్వాహకులకు ఇబ్బందులు లేకుండా పటిష్ఠ ఏర్పాట్ల మధ్య రెండు రోజుల్లోనే నిమజ్జనం పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. గురువారం 10వేల విగ్రహాల వరకు నిమజ్జనం అవుతాయని, శుక్రవారం ఉదయం వరకు పూర్తిస్థాయిలో నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే పోలీస్‌శాఖ నిఘా ఏర్పాటు చేసింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లోని ప్రతీ ఏరియాలో సీసీ కెమెరాలను ఉంచింది. గణేష్‌ ‌నిమజ్జనాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ట్యాంక్‌ ‌బండ్‌ ‌ప్రాంతం కోలాహలంగా మారింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy