Take a fresh look at your lifestyle.

గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం బాధ్యత మహిళా మేస్త్రీదే

మహబూబ్‌నగర్‌, జనవరి 10, (ప్రజాతంత్ర ప్రతినిధి) :జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణం బాధ్యత మహిళా మేస్త్రీదేనని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. గురువారం డిఆర్‌డిఎ మహిళా సమాఖ్య భవనం బండమీదిపల్లిలో ఏర్పాటు చేసిన మహిళా మేస్త్రీ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టే విధానంపై మహిళకు ఆరు రోజు పాటు శిక్షణనిస్తున్నామని, జిల్లాలో 85 వే మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టవల్సివుందని, మేస్త్రీు చాలా అవసరమని, పని చేసి డబ్బు సంపాదించానే తపన ఉండాలి, కరెక్టుగా ప్లాన్‌ చేసుకుని ముందుకెళ్లవచ్చని, శిక్షణ తీసుకున్న మహిళా మేస్త్రీు 10 రోజు పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు వీయితే రాత్రి కూడా అక్కడే ఉండి మరుగుదొడ్ల నిర్మాణ పను చేస్తామంటే అన్ని ఏర్పాట్లు చేయిస్తానని అన్నారు. ఎక్కడైతే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదో ఆ మండలానికి వెళ్లి 5 రోజు ఉండి అన్ని పను పూర్తి చేసి వచ్చేయాని అన్నారు. పని బాగా ఉండాలి కాని భయపడనవసరం లేదని మంచి మేస్త్రీ ఉంటే రెండు రోజుకు మూడు మరుగుదొడ్లు నిర్మించవచ్చని, మరుగుదొడ్ల నిర్మాణానికి కావసిన సామాను రింగు, సిమెంటు అన్ని మాట్లాడి పెట్టామని, మన జిల్లాలో 500 మంది మహిళా మేస్త్రీు తయారయితే వారికి క్లాస్‌`1 లైసెన్సు ఇప్పిస్తానని, లైసెన్సు ఉంటే బ్యాంకు నుండి సబ్సిడి కింద లోను తీసుకోవచ్చని అన్నారు. మణికొండ గ్రామంలో 400 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, తప్పనిసరిగా మణికొండ గ్రామంలో మీరే మరుగుదొడ్ల నిర్మాణ పను ప్రారంభం చేయాన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఓ క్రాంతి ఐఎయస్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శివశంకర్‌, న్యాక్‌ నిర్మాణ సంస్థ జెపినాయక్‌, అరుణ్‌, సంబంధిత అధికాయి తదితయి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy