Take a fresh look at your lifestyle.

గోదావరి ఉగ్రరూపం..

భద్రాచలం వద్ద 52అడుగులకు చేరిన ప్రవాహం
జలదిగ్భందంలో పలు గ్రామాలు.. నిలిచిపోయిన రాకపోకలు
ధవళేశ్వరం వద్ద 2వ నంబరు ప్రమాద హెచ్చరిక
175 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల
గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో నదీపరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుతుంది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ ‌మండలంలోని లక్ష్మీ బ్యారేజ్‌కు గత పన్నెండేళ్లలో ఎన్నడూలేని విధంగా వరద వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజ్‌ 84 ‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 96.600 టర్లు ఉండగా 7.259 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ప్లోలో 12.67లక్షలు కాగా, దిగువకు 12.70 లక్షల నీటిని విడుదల చేస్తున్నారు. వరంగల్‌ ‌జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద 9.920 టర్లుగా నమోదయ్యింది. కన్నాయిగూడెం మండలం దేవాదుల ఇన్‌టేక్‌వెల్‌ ‌వద్ద 88 టర్లు, తుపాకులగూడెం బ్యారేజ్‌ ‌వద్ద 85.52 టర్లు ఎత్తులో గోదావరి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. రామన్నగూడెం – రాంనగర్‌ ‌మధ్య జీడివాగుకు గోదావరి బ్యాక్‌వాటర్‌ ‌చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో ని పలు గ్రామాల్లో మిర్చి, వరి పొలాల్లోకి వరద చేరింది. వాజేడు మండలం పేరూరు వద్ద 46 అడుగులకు చేరినట్టు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. మండల కేంద్రం శివారులోని కొంగాలవాగు లోలెవల్‌ ‌చప్టా నీటి మునిగి వాజేడుకు వరద నీరు చేరింది. దీంతో వాజేడు గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోగా ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. పేరూరు, చండ్రుపట్ల గ్రామాల మధ్య మర్రిమగు వాగు బ్రిడ్జిపై వరద నీరు చేరడంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాచలం వద్ద గోదావరి 52 అడుగులకు చేరడంతో ప్రస్తుతం కరకట్ట వద్ద స్నానఘట్టాలు నీటి మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చర్ల మండలంలో లోతట్టు ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే వరద చుట్టుముడుతోంది. గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరితే పదుల సంఖ్యలో గ్రామాలను ఖాళీ చేయించే అవకాశం ఉంది. గోదావరి వరద ఉధృతితో పలు విలీన మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏజెన్సీలోని సోకిలేరు, అత్తాకోడళ్ళ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ధవళేశ్వరం వద్ద 2వ నంబరు ప్రమాద హెచ్చరిక…
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి వస్తున్న భారీగా వరదనీటితో ధవళేశ్వరం కాటన్‌ ‌బ్యారేజ్‌ ‌వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. బ్యారేజి వద్ద సెప్టెంబరు9, సోమవారం ఉదయానికి నీటిమట్టం 14.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. గోదావరి ఎగువ, దిగువ ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశారు. ఇన్‌ ఎన్‌ప్లో, అవుట్‌ ‌ప్లోలో 13.30 లక్షల క్యూసెక్కులు ఉండగా 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. డెల్టా కాల్వకు 8,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుమన్నారు. ధవళేశ్వంరం బ్యారేజి వరద నీటితో కోనసీమలో గోదావరి ఉధృతి పెరిగింది. కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృధ్ధగౌతమి నదులు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. ఇక్కడ 16 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పోలాలు నీట మునిగాయి. కూనవరం, ఎటపాక. చింతూరు, వీఆర్‌ ‌పురం మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలోని ఎడవల్లి వద్ద ఎద్దువాగు… కోయిదా వద్ద లోతు వాగు కాజ్‌ ‌వేపైకి వరద నీరు వచ్చి చేరుకుంది. కోయిదా, కకిస్నూర్‌, ‌తాళ్లగొంది, కట్కూర్‌…‌తూర్పుమెట్ట, చిగురుమామిడి, రేపాకుగొమ్ము, రుద్రంకోట తదితర గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కుక్కునూరు మండలంలో దాచారం బ్రిడ్జిపైకి వరద నీరు చేరుకోవడంతో దాచారం, గొమ్ముగూడెం, బేస్తగూడెం గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. వేల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు నీట మునిగాయి. పోలవరం ప్రాజెక్టులోని కాఫర్‌ ‌డ్యాం వద్ద గోదావరి ఉధృతంగా
ప్రహిస్తోంది. దేవీ పట్నంమండలంలోని 36 గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. 3 రోజులుగా గ్రామాల్లో కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy