వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

గుండెపోటుతో మృతి చెందిన.. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌

September 6, 2019

ఫోటో: శుక్రవారం అచ్చుమాయపల్లిలో రైతు ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న టీజెఎస్‌ అధ్యక్షుడు, ప్రొ।। కోదండరామ్‌
ఫోటో: శుక్రవారం అచ్చుమాయపల్లిలో రైతు ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న టీజెఎస్‌ అధ్యక్షుడు, ప్రొ।। కోదండరామ్‌

ఎరువుల కొరకు లైన్‌లో నిలబడి కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందిన అచ్చుమాయపల్లికి చెందిన రైతు చేర్వాపూర్‌ ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఎరువుల కొరకు క్యూ లైన్‌లో నిలబడి క్యూ లైన్‌లోనే ప్రాణాలొదిన అచ్చుమాయపల్లికి చెందిన రైతు ఎల్లయ్య కుటుంబ సభ్యులను టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరం శుక్రవారం అచ్చుమాయపల్లిలో పరామర్శించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ… రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయాంలో ఎరువులను కూడా అందించలేని కడు దయనీయ పరిస్థితులలో ఈ సర్కార్‌ ఉం‌దన్నారు. ఎరువుల కొరకు రైతు ప్రాణాలొదడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. ఎరువుల కొరకు రైతు ప్రాణాలొదడం కంటే దారుణం మరొకటి ఉండదన్నారు. మృతిచెందిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకో వాలన్నారు. ఆయన వెంట సిద్దిపేట జిల్లా ఇంఛార్జి బైరి రమేష్‌, ‌సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్‌ ‌తోడుపునురి వేంకటేశం, జిల్లా కో కన్వీనర్‌ ‌నిరుడి స్వామి, జిల్లా నాయకులు జువ్వన్న ప్రసాద్‌, ‌చేపూరి స్వామి గౌడ్‌, ‌కీసర స్వామి, నిమ్మ శ్రీనివాస్‌ ‌తదితరులు ఉన్నారు.