Take a fresh look at your lifestyle.

గిరిజన వర్సిటీ ఈ ఏడాదైనా ప్రారంభానికి నోచుకునేనా !

కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్న గిరిజన యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం కూడా ప్రారంభం అయ్యేలా లేదు ఎందుకంటే ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ప్రారంభించాలని భూమి సేకరణ చేపట్టడం జరిగింది. ఇప్పటికే కొన్ని భవనాలను కూడా తీసుకోవడం జరిగింది. వాటిలో తరగతులు నిర్వహించాలని అధికారులు సూచించడం జరిగింది కానీ గిరిజన యూనివర్సిటీ సంబంధించి పర్యవేక్షణ విశ్వవిద్యాలయంగా హైదరాబాద్‌ ‌కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని అధికారులు సూచించగా ఇటీవల హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీ విడుదల చేసిన అడ్మిషన్స్ ‌నోటిఫికేషన్‌లో గిరిజన యూనివర్సిటీ సంబంధించినటువంటి కోర్సుల నోటిఫికేషన్‌ ‌ప్రకటించకపోవడం గమనార్హం. మరియు హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీ నోటిఫికేషన్‌ ‌దరఖాస్తు చివరి తేదీ కూడా అయిపోయింది. గత మూడేళ్లుగా గిరిజన యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు, మార్గదర్శకాలు రాలేదు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో విజయనగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా ఈ విద్యా సంవత్సరంలో సంబంధించినటువంటి నోటిఫికేషన్‌ ‌కూడా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన పర్యవేక్షణ విశ్వవిద్యాలయంగా ఆంధ్రా యూనివర్సిటీ ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ మన రాష్ట్రంలో ఏర్పాటుకై ఇంతవరకు అధికారకంగా ఎటువంటి ప్రకటనలు కూడా వెలువడలేదు. ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు నిర్వహించాలని అనుకున్నా ఇప్పటివరకు ప్రారంభమే కాలేదు. మొదటగా ఆరు కోర్సులతో ప్రారంభం చేసి తర్వాత అధిక స్థాయిలో కోర్సులను మరియు పిహెచ్‌డీలను కూడా ప్రవేశ పెట్టాలని అనుకున్నారు. ప్రతి కోర్సులో 30 మంది విద్యార్థులకు అవకాశం కల్పించి 180 మందిని తీసుకోవాలని అనుకున్నా కేడా ఇంతవరకు గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం చేయకపోవడంపై తెలంగాణ ప్రాంత గిరిజన విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న స్థానిక గిరిజన విద్యార్థులకు రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం వల్ల ఇప్పటికే మూడు సంవత్సరాల జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఇరు ప్రభుత్వాలు సమన్వయంతో గిరిజన యూనివర్సిటీకి ఈ విద్యా సంవత్సరమే ఎట్టి పరిస్థితుల్లోనూ శంకుస్థాపన చేసి తరగతుల నిర్వహణ మరియు పూర్తిస్థాయి భవనాలను, పూర్తిస్థాయి అధ్యాపకులను నియమించే దిశగా చర్యలు చేపట్టాలి. గిరిజన యూనివర్సిటీలో వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– శ్రవణ్‌ ‌కుమార్‌ ‌కందగట్ల
కన్వీనర్‌, ‌తెలంగాణ ఫోరం

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy