మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ పుత్రునికి రెండో సారి సివిల్స్ ర్యాంక్
ఖమ్మం ఆగస్టు 5,ప్రజాతంత్ర ప్రతినిధి: గిరిజన కుటుంబంలో జన్మించిన గ్రామీణ విద్యార్ధి సివిల్స్ విజేతగా అందరికి స్పూర్తి నిస్తున్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ పుత్రుడు మృగేంద్రలాల్‌కు రెండో సారి సివిల్స్ ర్యాంకర్ నిలిచాడు. తొలి సారి సివిల్స్ విజేతగా నిలిచిన మృగేంద్రలాల్ ఐపిఎస్ శిక్షణ పొందుతూ రెండో సారి సివిల్స్ పరీక్షలలో తన సత్తా చాటారు. ఈ సారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో 505 ర్యాంక్ సొంతం చేసుకుని తన ప్రతిభతో ఐఏఎస్‌కు ఎంపికయ్యే స్వప్నన్ని సాకారం చేసుకున్నాడు. రెండు సార్లు సివిల్స్ విజేతగా నిలిచిన మృగేంధర్ నేటి తరం విద్యార్థులందరికి మార్గదర్శకంగా నిలిచి పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న లక్ష్యం సాధించవచ్చుని నిరూపించుకున్నారు.
వైరా నియోజకవర్గ శాసన సభ్యులుగా 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే బాణోత్ మధన్‌లాల్ అందించిన స్పూర్తి దాయక ప్రోత్సాహం మృగేంద్రలాల్‌ను రెండుసార్లు సివిల్స్ విజేతగా నిలిపింది.
దేశంలో అత్యున్నతంగా భావించే సివిల్ సర్వీసెస్‌లో విజేతగా నిలిచిన ఖమ్మం జిల్లా రఘనాధపాలెం మండలం ఈర్లపూడికి చెందినబాణోత్ మృగేంద్రలాల్ వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ తనయుడు. మృగేందర్‌లాల్ జాతీయస్ధాయిలో 505 వ ర్యాంక్ సాధించారు. మద్రాస్‌ఐఐటిలో చదివిని మృగేందర్‌లాల్ ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా అనునిత్యం కష్టపడ్డారు. తొలిసారి విఫలమైన 2018 లో నిర్వహించిన పరీక్షల్లో 551ర్యాంక్ సాధించి మహరాష్ట్ర క్యాడర్ ఐపిఎస్‌గా ఎంపికయ్యారు.ప్రస్తుతం నాసిక్‌లో శిక్షణ పొందుతున్నారు. నెలరోజుల్లో శిక్షణ పూర్తి చేసుకుని ఐపిఎస్ విధుల్లో చేరనున్నారు. అయితే శిక్షణ పొందుతూనే తన లక్ష్యం దిశగా ఐపిఎస్ సాధించాలనే పట్టుదలతో మృగేంద్రలాల్ మళ్ళీ సివిల్స్ పరీక్షలకు హజరయ్యాడు. మూడో ప్రయత్నంలో సాధించిన ర్యాంక్‌తో ఎస్టి కేటగిరిలో రావచ్చని తన కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.