Take a fresh look at your lifestyle.

గాంధీ మార్గం స్ఫూర్తిదాయకం ప్రజాస్వామ్య వ్యవస్థ..

నిజమైన సత్తా ఏందో గాంధీ ఆనాడే చెప్పారు
ఆయన సిద్ధాంతాలు భారత్‌కే పరిమితం కాలేదు
ఐరాసలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రజాస్వామ్య వ్యవస్థ నిజమైన సత్తా ఏంటో గాంధీ ఆనాడే చెప్పారని, గాంధీ భారతీయుడైనా ఆయన సిద్ధాంతాలు భారత్‌కే పరిమితం కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితిలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. గాంధీకి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐరాస
రూపొందించిన ప్రత్యేక స్టాంపును దేశాధినేతల సమక్షంలో ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం ’సమకాలీన ప్రపంచంలో గాంధీ సిద్దాంతాల ఔచిత్యం’ ఇతివృత్తంతో జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. గాంధీపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు ఐరాసకు ధన్యవాదాలు తెలిపారు. గాంధీ భారతీయుడైనప్పటికీ.. ఆయన సిద్దాంతాలు భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదన్నారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ వేడుకే అందుకు నిదర్శనమన్నారు. గాంధీతో పరిచయం లేనివారు సైతం ఆయన జీవితంతో ప్రభావితం అయ్యారని, మార్టిన్‌ ‌లూథర్‌ ‌కింగ్‌ ‌జూనియర్‌ ‌లేదా నెల్సన్‌ ‌మండేలా.. ఇలా ఎవరైనా కావచ్చు వారి ఆలోచనలన్నీ గాంధీ జీవితం, ఆయన ఆశయాలతో ప్రభావితం అయ్యాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ నిజమైన సత్తా ఏమిటో గాంధీ ఆనాడే చెప్పారని, ప్రజలు పాలకులపై కాకుండా తమపై తాము ఎలా ఆధారపడాలో గాంధీ మార్గనిర్దేశర చేశారని మోదీ అన్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా సమాజం ఎలా ముందుకు వెళ్లాలో పథనిర్దేశం చేశారని, ఈ విధానాలే నేడు భారత్‌ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారం చూపుతోందన్నారు. ప్రజల అంతర్గత శక్తిని మేల్కొలిపి, మార్పు తీసుకురావడానికి గాంధీ ప్రయత్నించారని మోదీ వివరించారు. ఇతరుల్ని ఎలా ఆకట్టుకోవాలి అనే యుగంలో మనం జీవిస్తున్నామని, కానీ, గాంధీ మాత్రం ఇతరుల్ని ఎలా ప్రేరేపించాలో నేర్పారని, ’కృషి లేని సంపద’, ’స్ప•హ లేని ఆనందం’, ’గుణం లేని జ్ఞానం’, ’విలువల్లేని వ్యాపారం’, ’మానవత్వం లేని శాస్త్రవిజ్ఞానం’, ’త్యాగం లేని మతం’ ఈ ఏడు మనిషి దృష్టి మరల్చేవని వీటిని పట్ల జాగ్రత్తగా ఉండాలని గాంధీ సూచించారన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, అవినీతి లాంటి రుగ్మతల నుంచి మానవాళిని రక్షించుకోవడానికి ఈ ఏడు సూత్రాల అంశం నేటికీ ఆచరణీయమే అన్నారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో గాంధీ చూపిన మార్గం మనందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను‘ అంటూ గాంధీ సిద్దాంతాల్ని, సమకాలీన ప్రపంచంలో వాటి ఔచిత్యాన్ని మోదీ స్పష్టంగా వివరించారు.ఈ సందర్భంగా ఐరాసలో భారత్‌ ‌నెలకొల్పిన ప్రత్యేక సోలార్‌ ‌ప్లాంట్‌ను మోదీ దేశాధినేతల సమక్షంలో ప్రారంభించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో పాటు, సింగపూర్‌, ‌భూటాన్‌, ‌దక్షిణ కొరియా, సింగపూర్‌, ‌జమైకా, న్యూజిలాండ్‌ ‌సహా పలువురు ఇతర దేశాధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy