Take a fresh look at your lifestyle.

గర్భిణీల ప్రసవాలు పిహెచ్‌సిలలోనే జరగాలి

ఇంట్లో ప్రసవం జరిగితే వైద్యాధికారి, ఏఎన్‌యంలపై క్రమశిక్షణ చర్యలు :  పిఓ గౌతమ్‌ ‌పొట్రూ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజన్సీ ప్రాంతంలో గిరిజన కుటుంబాలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతం అని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వందశాతం గర్భిణీస్త్రీలు ప్రసవాలు జరిగే విధంగా సంబంధిత వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని , ఎక్కడైన హోం డెలీవరి జరిగాయని తెలిసిన పక్షంలో సంబంధిత వైద్యాధికరి ఏఎన్‌యంను భాధ్యులు చేస్తూ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్‌ ‌పొట్రూ హెచ్చరించారు. గురువారం ఐటిడిఏ పిఓ చాంబర్‌ ‌డియంహెచ్‌ఓ ఏరియా ఆసుపత్రి సూపరిడింట్‌ ‌సంబంధిత అధికారులతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు తగ్గుదలపై వైద్య సిబ్బంది విధి నిర్వహన నిర్లక్ష్య ధోరణిపై పిఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ కరోనా మహ్మారి విజృంభిస్తుంనందున నిర్మూళించ డానికి సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ డాక్టరు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పిహెచ్‌సీలలో అందుబాటులలో ఉండాలని ఇమ్యూనైజేషన్‌ ‌వందశాతం టార్గెట్‌ ‌పూర్తి చేయాలని పిహెచ్‌సీ లలో సమస్యలు ఉన్న దగ్గర యంపిడిఓ బృందాలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఎస్‌డి బృందాలు ప్రతీ గ్రామంలో బిపి షుగర్‌ ‌పరీక్షలు చేసి మందులు అందించాలని ప్రతీ రిజిష్టర్‌ ‌సక్రమంగా నిర్వహించాలని ఆయన అన్నారు. డెంటల్‌, ‌డయాబెటీస్‌ ‌రోగులను తరలించడానికి కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం నకు తరలించడానికి ఇబ్బందులు కలుకుండా చేరవేయాలని ఆయన సూచించారు.

పిహెచ్‌సీలలో అందుబాటులో ఉండాలని జిల్లాలోని అన్నీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా ఆకస్మిక తనిఖీ చేయటం జరుగుతందని సిబ్బంది అందరు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని చెప్పటం జరిగిందని అయినను సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి కొన్ని కొన్ని పిహెచ్‌సీలలో విధి దర్మాలను విస్మరిస్తున్నారని అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గర్భణ •స్త్రీలకు ఆసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా సంబంధిత వైద్యాధికారి ఏఎన్‌యం ప్రోత్సహించాలని అన్నారు. వ్యాధుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన గ్రామాలలో గిరిజనులు శారీరక పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత త్రాగునీరు వేడి చేసి త్రాగే విధంగా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. గిరిజన గ్రామాలలో నీరు నిల్వ ఉండకండా ప్రదేశాలలో దోమలు నిల్వ ఉండకుండా నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాకాలం నడుస్తుంనందున ఏజన్సీ ఏరియాలలో సమస్యాత్మక గ్రామాలలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి రక్త పూతలు సేకరించి సంబంధిత ఏఎన్‌యం ద్వారా ల్యాబ్‌కు పంపించి టెస్ట్ ‌చేయలని మలేరియా అని నిర్ధారణ అయితే ఆ గ్రామాలలో దోమలు మందు పిచికారి చేయాలని అదేవిధంగా దోమ తెరల పంపిణీ తప్పకుండా చేయాలని అత్యవస• •మైతే ఆ గ్రామాల్లోని విఆర్వోల సహాయంతో సంబంధిత సర్పంచ్‌ ‌గ్రామంలోని స్వఛ్చంద సంస్థల యువకులతో గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఏదైనా డెంగ్యూ కేసులు ఏమైనా ఉంటే ప్రత్యేక జ్రాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతీ పిహెచ్‌సీలలో 108 వాహనం అందుబాటులో ఉంచుకునేల సంబధిత మెడికల్‌ ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని ఏజన్సీ ఏరియాలలోని పాఠశాలలు తెరిచిన సమసయంలో మిగిలి ఉన్న దోమ తెరలను పంపిణీ చేసేవిధంగా సంబంధిత హెచ్‌ఇఓలు ప్రతిపాదనలు సిద్ద్దం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్‌ ‌నాయక్‌, ఏడియం హెచ్‌ఓ ‌నివాసులు•,ఆసుపత్రి సూపరిడింట్‌ ‌యుగందర్‌, ‌సంబంధిత ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply