వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

గతంలో 5 దేశాలు తిరిగి వచ్చిన అనసూయమ్మ..

September 12, 2019

వేరే దేశాల నుండి చాల మంది మా దగ్గరకు వచ్చారు. మేం చేస్తున్న పనిని మెచ్చుకున్నారు. మా గ్రామాల్లో ఉన్న వందల ఎకరాల పోరంబోకు భూముల్లో 20 లక్షల చెట్లు నాటాను. మేం చేస్తున్న పనిని తెలుసుకొని, గుర్తించి మాకు ఆ దేశం వాళ్ళు అవార్డు
ఇస్తుంటే ఇక్కడ మన దేశంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని అడిగి ఏమీ తెలుసుకోకుండానే మీరు అమెరికా వెళ్ళడానికి అనర్హులు అంటూ వీసా ఇవ్వలేదు. మేము ఎందుకని అనర్హులం. మా రూపాలను చూసా.. లేకపోతే మేము గ్రామీణ దళిత మహిళలం అనా లేక పైసలున్న పెద్ద వాళ్ళం కాదనా అని ప్రశ్నిస్తున్నది అనసూయమ్మ.

ఎం‌దుకు అనర్హులమో చెప్పలేదు : మొగులమ్మ

(డెక్కన్‌ ‌డెవలప్మెంట్‌ ‌సొసైటీ సమాఖ్యలకే కాదు అఖిలభారత చిరుధాన్యాల చెల్లెండ్ల సమాఖ్య అధ్యక్షురాలు, సేంద్రియ రైతు)
అమెరికా వాళ్ళు వచ్చి మా పనిని, మా విత్తనాల్ని, మా పంటల్ని చూసారు. మా కృషిని
గుర్తించారు. మమ్ములను అవార్డు అందుకోవడానికి రమ్మని ఆహ్వానించారు. కాబట్టే మేం వీసాకి వెళ్లాం.ఎక్కడివెళ్త్లున్నారు..ఎందుకు వెళ్తున్నారు.. మీ ఊరేంటి అని మాత్రం అడిగారు. అడిగిన వాటికి జవాబు చెప్పాం. కానీ మాకు వీసా ఇవ్వలేదు. మహిళా రైతులైన మమ్మల్ని వెళ్ళడానికి అనర్హులుగా ప్రకటించారు. వాళ్ళ రూల్స్ ఏమిటో మాకు అర్థం కావడంలేదు. ఎందుకు అనర్హులమో చెప్పలేదు. మేం అక్కడే ఉండిపోతామనుకున్నారా.. లేకపోతే అక్కడేమన్నా పనులు చేసుకుంటామనుకున్నారా .. లేకపోతే పేదవాళ్ళు వెళ్ళడానికి అర్హత లేదా..?
మేం అనర్హులమైతే..
ఫింగర్‌ ‌ప్రింట్స్ ఎం‌దుకు తీసుకున్నారు? : మయూరి

(ఆసియాలో బయో డైవర్సిటీ ఫిలిం మేకర్‌ అవార్డు అందుకున్న మయూరి సంఘం సభ్యుల్లో పిన్న వయస్కురాలు)
మేం అనర్హులమైతే మరి మమ్ముల్ని మా ఊర్లనుండి ఈ పట్నానికి ఎందుకు రప్పిచ్చి
నట్లు? మా అప్లికేషన్‌ ‌ముందుగా ఆన్‌లైన్లో సబ్మిట్‌ ‌చేసినప్పుడే తిరస్కరించవచ్చు కదా.. ఫింగర్‌ ‌ప్రింట్స్ ఎం‌దుకు తీసుకున్నారు? 214 (బి) రూల్‌ ‌ప్రకారం అనర్హులు అన్నారు. ప్రపంచంలోనే ఒక గొప్ప అవార్డు అందుకునే అసాధారణమైన అవకాశాన్ని కోల్పోతున్నందుకు ఎవరిని నిందించాలో అర్థం కావడంలేదు.