Take a fresh look at your lifestyle.

గతంలో ఏం ప్రయోజనం ఒనగూరింది?

మెగా బ్యాంకులుగా అభివర్ణితమైన ప్రభుత్వ రంగంలోని ఎస్‌బిఐ, బ్యాంక్‌ ఆప్‌ ‌బరోడా, పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంకు లనూ, ప్రైవేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంకునూ తరచుగా ప్రజల పరిశీలన ముందు ఉంచుతున్నారు, అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి దశాబ్దం దాటింది. అయినప్పటికీ ఈ పెద్ద బ్యాంకులు ఆ పెద్ద స్థాయికి అనుగుణంగా పటిష్ఠం కాలేక పోతున్నాయి. ఫార్గో, డచ్‌ ‌బ్యాంకులు పెద్ద బ్యాంకులు ఎంత బలహీనంగా ఉన్నాయో బహిర్గతం చేశాయి. దురదృష్టమేమంటే మన విధాన నిర్ణయాలు అంతర్జాతీయ స్థాయిని అందుకునేంతగా పటిష్టంగా లేవు. గత అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకునే రీతిలో లేవు. పాత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్వకుండా.. మరో దఫా బ్యాంకుల విలీనంగతంలో పెద్ద బ్యాంకులను విలీనం చేయడం వల్ల వచ్చిన లాభాల గురించి ఇప్పటికీ ప్రకటించలేదు. 2008లో ఆర్థిక సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా కూడా పెద్ద ప్రయోజనమనిపించలేదు.
కొత్తగా ప్రభుత్వ రంగానికి చెందిన పెద్ద బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చేసిన ప్రకటనకు మిశ్రమ స్పందన లభించింది. రాజకీయ విధేయతలకు అనుగుణంగా నిపుణులు, వ్యాఖ్యాతలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ వ్యాఖ్యానాల్లో తార్కికత కూడా ఉంది. గతంలో దేనా బ్యాంకు, విజయ బ్యాంకులను బ్యాంక్‌ ఆప్‌ ‌బరోడాలో విలీనం చేశారు. వాటి విలీనం వల్ల ఏమేరకు ప్రయోజనం ఒనగూరిందో ప్రభుత్వం ఇంతవరకూ ప్రకటించలేదు. బ్యాంకుల విలీనం తర్వాత ఏకీకృత విధానం, వ్యూహం లేకపోవడం వల్ల ఈ బ్యాంకుల్లో పాత పద్దతులే కొనసాగుతూ వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రాధాన్యంగా కనిపించడం లేదు. విలీనానికి ముందు దేనా బ్యాంకులోని నిరర్థక ఆస్తుల (ఎన్‌ ‌పిఏ) ల సంగతి ఏం చేశారో తెలియదు. ఈ నిరర్ధక ఆస్తులు పెరగడానికి బాధ్యత ఎవరో నిర్ధారించే పని కూడా పూర్తి కాలేదు. అలాగే, అలాంటి ఉదార రుణాలను ఇవ్వడం నుంచి బ్యాంకులు గుణపాఠాలు నేర్చుకున్న వైనం కూడా కనిపించడం లేదు. అంత పెద్ద మొత్తాల్లో రుణాలు మంజూరు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న విషయం గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు కొత్తగా బ్యాంకుల విలీనం గురించి ప్రకటన చేసే సందర్భంలో అందరికీ తెలిసిన విషయాలనే మరోసారి స్పష్టీకరించారు. ఈ విలీన ప్రక్రియ దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికీ, అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించడానికి ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. 2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ‌నిలదొక్కుకోవడానికి ఈ చర్య దోహదం చేస్తుందని అన్నారు.
ఇలా ఉండగా, గతంలో ఐదు అనుబంధ బ్యాంకులనూ, భారతీయ మహిళా బ్యాంకునూ స్టేట్‌ ‌బ్యాంకు ఆఫ్‌ ఇం‌డియాలో విలీనం చేసే సమయంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్నారు. ఈ విలీనం వల్ల ఒనగూరిన ప్రయోజనాన్ని ప్రజల ముందుంచుతామని అన్నారు. కానీ, అలా జరగలేదు. మెగా బ్యాంకులుగా అభివర్ణితమైన ప్రభుత్వ రంగంలోని ఎస్‌బిఐ, బ్యాంక్‌ ఆప్‌ ‌బరోడా, పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంకు లనూ, ప్రైవేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంకునూ తరచుగా ప్రజల పరిశీలన ముందు ఉంచుతున్నారు, అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి దశాబ్దం దాటింది. అయినప్పటికీ ఈ పెద్ద బ్యాంకులు ఆ పెద్ద స్థాయికి అనుగుణంగా పటిష్ఠం కాలేక పోతున్నాయి. ఫార్గో, డచ్‌ ‌బ్యాంకులు పెద్ద బ్యాంకులు ఎంత బలహీనంగా ఉన్నాయో బహిర్గతం చేశాయి. దురదృష్టమేమంటే మన విధాన నిర్ణయాలు అంతర్జాతీయ స్థాయిని అందుకునేంతగా పటిష్టంగా లేవు. గత అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకునే రీతిలో లేవు.
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని తొలివిడత ప్రభుత్వం ఇంద్ర ధనుష్‌ ‌పేరిట బ్యాంకింగ్‌ ‌సంస్కరణలను తెచ్చింది. వీటి వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఎటువంటి మార్పులు రాలేదు.అందుకు భిన్నంగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో సంక్షోభాలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాల వసూళ్ళు ఈ ఏడాది కూడా బలహీనంగా ఉన్నట్టు సమాచారం. ఆర్థిక వ్యవస్థే తీవ్ర మైన ఒత్తిళ్ళను ఎదుర్కొంటోంది. మందకొడిగా సాగుతోంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న బ్యాంకులను పటిష్టం చేయడమే తరుణోపాయం. బ్యాంకుల విలీనం కన్నా అదే మంచి పని.
విలీనాల వల్ల వాటి ప్రత్యేకతలపై వేటు
ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని బ్యాంకులు వాటి ప్రత్యేకతలను కోల్పోనున్నాయి. వాటి చారిత్రక ప్రాధాన్యతను కూడా కోల్పోనున్నాయి. వీటిలో కర్నాటక కోస్తా జిల్లాలకు చెందిన రెండు బ్యాంకులు ఉన్నాయి. సిండికేట్‌ ‌బ్యాంకు, కార్పొరేషన్‌ ‌బ్యాంకు. పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలో ని పూర్వపు సౌత్‌ ‌కెనరా జిల్లాలో నాలుగు బ్యాంకింగ్‌ ‌దిగ్గజాలు ఉండేవి. ఈ నాల్గింటినీ స్థానిక ప్రముఖులే ప్రారంభించారు. కార్పొరేషన్‌ ‌బ్యాంకును హాజీ అబ్దుల్లా, సిండికేట్‌ ‌బ్యాంకును టిఎంఎ పాయ్‌, ‌విజయబ్యాంకును ఎబి షెట్టి, కెనరా బ్యాంకును అమ్మెంబాయ్‌ ‌సుబ్బారావు పాయ్‌ ‌నెలకొల్పారు. వీరిలో ఎవరూ కూడా పారిశ్రామిక వేత్తలు కారు ప్రజల్లో పొదుపు అలవాటును పెంచడం లక్ష్యంగా వారు ఈ బ్యాంకులను ప్రారంభించారు. ఆ అలవాటు ఎలాంటిదంటే ప్రజల భావోద్వేగాలతో ముడివేసినంతటిది. ఈ బ్యాంకులు దినదినాభివృద్ధి చెందేందుకు ప్రజలు ఎంతో తోడ్పడ్డారు. ఈ కారణంగానే 1969లో కెనరా బ్యాంకు, సిండికేట్‌ ‌బ్యాంకులు జాతీయం కాలేదు. కార్పొరేషన్‌ ‌బ్యాంకు, విజయ బ్యాంకు జాతీయం కావడానికి 11 ఏళ్ళు ఎక్కువ కాలం పట్టింది. ఈ బ్యాంకులు దేశంలో మారూమూల ప్రాంతాల్లో లేవు. బ్యాంకింగ్‌ ‌పరిశ్రమలో తలెత్తిన ఎన్నో సంక్షోభాలను తట్టుకుని ఇవి నిలిచాయి. కర్నాటకలోని కోస్తా జిల్లాల్లో అనేక విద్యా సంస్థలు, హొటళ్ళు, చిన్న వ్యాపార సంస్థలు ఏర్పడటానికి దోహదం చేశాయి. ఇవి 1949లో బ్యాంకింగ్‌ ‌రెగ్యులేషన్‌ ‌యాక్ట్ అమలులోకి రావడానికి ముందే సేవలందించడం మొదలు పెట్టాయి. ఈ బ్యాంకుల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే,. కోస్తా దక్షిణ కెనరా జిల్లా దేశం మొత్తం మీద మెట్రో పాలిటన్‌ ‌నగరాలను మినహాయిస్తే , ఎక్కువ బ్యాంకుల సాంద్రత కలిగిన జిల్లా గా పేరొందింది. ఆ యా ప్రాంతాల సాంఘిక, సాంస్కృతిక రంగాలతో సంబంధాలను ఈ బ్యాంకులు పెనవేసుకుని పోయాయి. ఇప్పుడు విలీనం వల్ల ఈ బ్యాంకులన్నీ వాటి ప్రత్యేకతను కోల్పోయి, దేశ వ్యాప్తంగా బ్యాంకులు గంగా ప్రవాహంలో కలిసిపోతాయి.
అయితే, ఈ తాజా నిర్ణయాన్ని ప్రభుత్వ అనుకూల వర్గాలు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. గతంలో ఎదురైన అనుభవాలనుంచి ప్రభుత్వం ఎటువంటి గుణ పాఠాలు నేర్చుకోలేదు.ఎవరినీ సంప్రదించలేదు. ప్రభుత్వం తాను నియమించిన బ్యాంకుల బోర్డుల బ్యూరో సభ్యుల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఉదాహరణకు ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్న వినోద్‌ ‌రాయ్‌ ‌సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన బరోడా బ్యాంకు చైర్మన్‌ ‌గా అమూల్యమైన సేవలను అందించారు. ఆయన చేసిన సిఫార్సులు ప్రభుత్వ పురావస్తు శాలలోకి చేరి ఉంటాయి. 18 మాసాల క్రితం ఆయన పదవి నుంచి వైదొలగారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్పొరేట్‌ ‌పాలనా తీరును మెరుగు పర్చేందుకు వినోద్‌ ‌రాయ్‌ ఎన్నో సూచనలు చేశారు. వాటి గురించి ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించలేదు. అయితే, బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సీఈఓ కేడర్‌ ఉద్యోగాల్లో రిక్రూట్‌మెంట్‌ ‌స్వతంత్రంగా, పారదర్శకంగా జరుగుతుందని మంత్రి అన్నారు. విలీనం కానున్న బ్యాంకుల బోర్డులు త్వరలో సమావేశమై విలీనానికి సుముఖత వ్యక్తం చేస్తూ తీర్మానాలు చేస్తాయని మంత్రి అన్నారు. చిన్న డిపాజిట్‌ ‌దారులకు బ్యాంకుల్లో కొత్తగా ఎలాంటి సీఈఓలు వస్తారో తెలియదు. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సీఈఓలుగా బయటివారిని నియమించారు. వారు ఏం సాధించారో తెలియదు. ప్రభుత్వం మాత్రం పాత అనుభవాలనుంచి ఏమీ నేర్చుకోలేదన్నది స్పష్టం అవుతోంది.
– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy