Take a fresh look at your lifestyle.

ఖమ్మంలో ఆర్టీసి డ్రైవర్‌ ఆత్మహత్యా యత్నం

ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం

ఫోటో: ఖమ్మం లో ఆర్టీసీ డ్రైవర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి ఆత్మహత్యాయత్నం 90% కాలిపోయిన శరీరం

 

ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ఆర్టీసి డ్రైవర్‌ ‌శ్రీనివాస్‌రెడ్డి శనివారం సాయంత్రం ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. 90శాతం మేరకు శరీరం కాలిపోయింది. అతన్ని వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్‌ ‌వైద్యశాలకు తరలించారు. ప్రభుత్వం
ఆర్టీసి సమ్మెపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ అవలంభిస్తున్న మొండి వైఖరికి నిరసనగా శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నేలకొండపల్లి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యా ప్రయత్నంతో సమాచారం తెలుసుకున్న కార్మిక సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ ఎదుగా చేరుకొని రోడ్డుమీద నిరసన తెలియజేశారు. సిఎం కెసిఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. జనం పెద్దఎత్తున గుమికూడడంతో ట్రాఫిక్‌ ‌స్తంభించిపోయింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పొన్నం వెంకటేశ్వర్‌రావు, పొతినేని సుదర్శన్‌రావు, కాంగ్రెస్‌ ‌నాయకులు పువ్వాడ దుర్గాప్రసాద్‌, ‌సిపిఐ నాయకుడు హేమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!