Take a fresh look at your lifestyle.

కోట్లు కరిగే… అభివృద్ధి మురుగే…

ఐదేళ్లలో పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలు…
ప్రత్యేక ఆధికారుల చేతుల్లోకి బల్ద్దియాలు..

ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలోని మూడు మున్సిపాలిటి పాలన గడువు ముగిసింది ప్రత్యేక ఆధికారుల చేతుళ్లకి వెళ్ళిపోయాయి. గడిచిన 5సంవత్సర కాలంలో జగిత్యాల,కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిల్‌ ‌సభ్యులు చేసిన ఆభివృద్ధి, అంతమాత్రంగానే ఉంది. కోట్లాది రుపాయలు నిధుల ఖర్చు చేసినా దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. కౌన్సిల్‌ ‌వీడ్కోలు సమవేశంలో కొందరు కౌన్సిలర్లు ఏమిచేయలేకపోయామనే విచారం వ్యక్తం చేయడం గమానార్హం. కౌన్సిల్‌ 5‌సంవత్సర పదవి కాలంలో పురప్రజలకు పెద్ధగా ఒరిగింది ఏమిలేదనీ విమర్శలు ఉన్నాయి. ఈ నేపద్యంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటిలో పెండింగ్‌ ‌సమస్యలపై ‘ప్రజాతంత్ర ప్రత్యేక ••ధనం’
మహిళల కోసం అడిగే వారు లేరు…

జిల్లాలోని మూడు మున్సిపాల్టిల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ‌చాలా కాలం నుంచి ఉంది. కానీ దాని గురించి పట్టించుకున్న వారు సర్వసభ్య సమావేశాల్లో కలమెత్తిన వారు లేరు. జగిత్యాల మున్సిపాల్టీ సచ్చలో ప్రధమ స్దానంలో ఉన్న మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేవు. తొలుత మహిళలు ఎదుర్కొంటున్న అత్యవసర ఇబ్బందిని తొలగించాల్సిన అవసరం ఉంది.
పద్దతిమారేనా…

పట్టణాల్లో ఎక్కడో ఒకచోట సులబ్‌ ‌కాంప్లెక్స్ ఉన్నా వాటిని వినియొగించుకునేందుకు మహిళలు రారు. ఆ పరిసర ప్రాంతాలన్ని మురిగి పట్టి ఉండడం యాచకులు అక్కడే చుట్టుపక్కల తమ స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉండడం, పక్కనే తోపుడు బండ్లు దీంతో అసలే సిగ్గుతో ఉండే మహిళలు అటు వైపు పూర్తిగా కన్నెత్తి చూసేందుకు ఆసక్తి చూపించరు.అందుకే కచ్చితంగా మూడు మున్సిపాల్టిలో మహిళలకు వేరువేరుగా మూత్రశాలలు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కనీసం ఒకే చోట అందరు సౌకర్యం కూడా లేకపోవడం సిగ్గుచేటని మహిళలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు స్వచ్చా భారత్‌ ‌పేరుతో బహిరంగ మల మూత ్రవిసర్జన నిశేధించినప్పటికి మున్సిపాల్టిల్లో పేరుకున్న జాడ్యం తేరుకోక పోవడంతో స్వచ్చా భారత్‌కు జిల్లాలో విగాంతం కలుగుతుంది. కోరుట్ల మెట్‌పల్లి మున్సిపాల్టిలో పౌరులకు నిత్యవసరమైన మరుగుదొడ్లు మూత్రశాలల విశయంలో ఎక్కడ కనీస స్దాయిలో ఏర్పాటు్ల లేకపోవడం శోచనీయం. అందుకే చాల ప్రాంతాల్లో రోడు పక్కన నిలబడి పనికానిచ్చెయడం కనిపిస్తుంది.

జగిత్యాల మున్సిపాల్టి-38వార్డులు
పట్టణ జనాభ లక్ష 3వేల930
మురికి కాలువలు 160 కిలోమీటర్లు
అటుకెక్కిన మాస్టర్‌ప్లాన్‌…..

1952‌లో జగిత్యాల మున్సిపల్‌ ‌కేంద్రంగా ఏర్పడ్డది. గ్రేడ్‌ 2 ‌మున్సిపాల్టి నుంచి 1984లో గ్రేడ్‌ 1 ‌మున్సిపాల్టిగా రూపాంతరం చెందింది.16స్కేర్‌ ‌కిలోమీటర్ల విస్తిర్ణంలో ఉన్న పట్టణాన్ని 38 వార్డులుగా విభజించారు. 23,213 కుటుంబాలు నివసిస్తున్నాయి. లక్ష 10వేల పట్టణ జనాభతో 31 స్లమ్‌ ఏరియాలు, 3 నోటిఫైడ్‌ ఏరియాలున్నాయి.సంవత్సర ఆదాయం రూ.10 కోట్లపైన వస్తుండగా ఖర్చు రూ.8.5 కోట్లు దాటుతుంది.1989లోనే మాస్టర్‌ ‌ప్లాన్‌ అమలు చేయాలని అప్పటి ప్రభుత్వం జీవో ఎమ్‌ఎస్‌ ‌నెం 149 ద్వారా ఉత్తరువులు జారిచేసింది. అప్పటి 10వేల పట్టణజనాభకు అనుగునంగా ఏర్పాట్లు చేసిన రోడ్లు ఇప్పటి వరకు అలాగే ఉండడంతో రద్ది విపరీతంగా పెరిగి పట్టణంలో రోజుకో వాహన ప్రమాదం చోటు చేసుకుంటుంది. 60 ఫీట్ల యావరోడును ఫుట్‌పాతులు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. ఓటు బ్యాంక్‌ ‌రాజకీయాలతో ఫుట్‌పాతులు బస్టాండ్‌ ‌చౌరస్తాలో అక్రమంగా షెడ్లు వేసిన పట్టించుకునే నాదుడు లేదు దీంతో 60 ఫీట్ల రోడులో 40 ఫీట్లు మిగలగా పట్టణ జనాభ 1లక్ష 10వేలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ప్రతి రోజు వందలాదిగా వచ్చిపోతుంటారు. దీంతో వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో ప్రమాదాల సంఖ్య కూడ అంతే పెరిగింది. 88 కిలోమీటర్ల రోడ్డు ఉండగా 108 కిలోమీటర్ల డ్రైనేజ్‌ ‌వ్యవస్ద ఉంది. తేలిక పాటి వర్షాలకే మురికి కాలవులు పొంగి రోడ్లు చెరువలను తలపిస్తాయి. 2017లో రోడ్డు విస్తరణ చేస్తామని వరంగల్‌ ‌నుంచి టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు కొలతలు తీసి హడావుడి చేసి వెల్లిపోయారు.2017 ఎప్రిల్‌ 17‌న జగిత్యాలలో ఏర్పాటు చేసిన జనహిత సభ సందర్బంగా పురపాలక శాఖ మంత్రి కేటిఆర్‌, ఎం‌పి కవితలు స్దానిక ఆర్డివో కార్యాలయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రోడ్ల వెడల్పుకు ఆదేశాలు జారీ చేశారు. 2017 మే 1న నోటిఫికేషన్లు విడుదల చేశారు.

జూన్‌ 1 2017 ‌నుంచి రోడ్డు విస్తరణ పనులు మొదలు పెడతామని ప్రకటించారు. దీనికి తోడు మున్సిపల్‌ అభివృద్దికి రూ.50 కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటిఆర్‌ ‌ప్రకటించారు. దీంతో జగిత్యాల పట్టణ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.మున్సిపల్‌ అధికారులు డిపిఆర్‌ ‌సిద్దం చేసి డైరెక్టర్‌ ఆఫ్‌ ‌టౌన్‌ప్లానింగ్‌ ‌హైదరాబాద్‌ ‌కు నివేదికలు పంపించారు.8 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు కేటాయించిన 50 కోట్లకు ప్రభుత్వం జీవో విడుదల చేయకపోగా రోడ్ల విస్తరణ అర్దాంతరంగా ఆగిపోయింది.జగిత్యాల పట్టణం నుంచి జాతీయ రహదారి వెల్తుండడంతో భారి వాహణాలు తో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy