కెఎంసిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన భననాన్ని ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రిగా మార్చిన నేపథ్యంలో అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఇటీవల 15 రోజుల పాటు సెలవుపై వెళ్లి నేడు విధులకు హాజరైన వెంటనే ఎంజిఎం, కెఎంసి ఆవరణలో పిఎంఎస్ ఎస్వై నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తి పనులకు రాష్ట్ర వాటా క్రింద రాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యం లో నిధుల లేమి లేనందున సత్వరమే అన్ని పనులను పూర్తి చేసి సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ అన్ని అంతస్తుల పరిశీలించారు. ఆక్సిజన్ బెడ్స్ వెంటిలేటర్లు ఏర్పాటులో జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ )లిత దేవి, కెఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య , ఎంజి ఎం ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగా ర్జున రెడ్డి, డిఎస్ఓ డాక్టర్ కృష్ణ రావు టిఎస్ఎం ఐడిసి ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎంజిఎం అవరణలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలన, అదనపు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ కోసం అను మతులు జారీ చేయాలని సూపరింటెండెంట్ కోరగా వెంటనే అనుమతి జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వార్డులో ఉన్న పేషెంట్లను తరలించి వేరొక వార్డులో ఏర్పాటు చేయాలంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యం లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రాష్ట్ర హై పవర్ కమిటీ మెంబర్ ఇటీవల ఎంజిఎంను పరిశీలిం చి సూచనల ప్రకారంగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూపరింటెండెంట్ ను కోరగా సూపర్ స్పెషాలిటీ వార్డు తరలించకుం డా ఇంతకు ముందే బెడ్స్ సిద్దంగా ఉన్న పాత సర్జికల్ వార్డులో 90 పడకలు ఫీవర్ వార్డులో 60 పడకలు ఏర్పాటు చేయాలని వైస్ ఛాన్సలర్ సూచించినట్లు తెలిపారు. మొత్తం 150 బెడ్స్ అందుబాటు లో తెచ్చేందుకు ఆక్సిజన్, వెంటిలేటర్ల ఏర్పాటు కు వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జున రెడ్డి కలెక్టర్కు వివరించారు.