కొరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రావు అన్నారు సోమవారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు నిరసన వ్యకతం చేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రములో రోజు రోజుకు కొరోనా పెరిగిపోతున్న ముఖ్య మంత్రి కేసీఆర్ కు ఎంపీ పట్టడం లేదని టెస్టులు చేయించడంలో రాష్ట్రం వెనక బడి ఉందన్నారు రాష్ట్ర నాయకులు ధర్మారా మాట్లాడుతూ హైద్రాబాద్ లో ప్రతి ప్రాంతంలో విజృభిస్తున్న వైరస్ కు గాంధీలో చికిత్స అందించలేని దుస్థితిలో ప్రభుత్వం పని చేస్తుందని ఎద్దేవా చేశారు ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో ప్రవేశ పెట్టాలని అలాగే ఆరోగ్య సేత్ ప్రతి ఇంటికి చేరుకునే విధగ అమలు చేయాలని పేర్కొన్నారు ఈ ధర్నాలో నాయకులు లక్ష్మణా రావు శశ్యామసుందర్ శర్మ శశివర్ధన్ రెడ్డి బివి రాఘవులు పాల్గొన్నారు.
మరిపెడలో…
మరిపెడ: జూన్22,(ప్రజాతంత్ర విలేకరి): మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఎదుట బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు భూక్య కాంతమ్మఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు కరోనా వైరస్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత వైఖరికి నిరసనగా ధర్నా చేసినారు.ఈ సందర్భంగా భూక్య కాంతమ్మ మాట్లాడుతూ తెలంగాణాలో అధిక టెస్టులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు.