కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగి ప్రమాదకర పరిస్థితులు రాకముందే పోలీస్ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేసేందుకు పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. బుధవారం పోలీస్ కమిషనర్ చెక్ పాయింట్లను సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు.లాక్ డౌన్ వంటి క్లిష్టమైన పరిస్థితులలో ప్రభుత్వం కల్పించిన సడలింపులను అసరాగా చేసుకొని కొంతమంది భాద్యతరహితంగా రోడ్లపై తిరుగుతూ.. దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పోలీస్ కమిషనర్ ఆదేశించామన్నారు. దీంతో అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్ చేశారు.
అంక్షలు పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించి చెక్ పెట్టేందుకు పోలీస్ టెక్నికల్ టీమ్స్ ‘‘సిటిజన్ ట్రా కింగ్ యాప్ ఫర్ కోవిడ్ 19’’ యాప్ ద్వారా ఇంటి నుంచి బయటకు వచ్చే వాహనదారుడు డివిజన్ పరిధి దాటి ప్రయాణం చేస్తే చాలు మరో చెక్ పాయింట్లలో ఉన్న పోలీసులను అప్రమత్తం చేస్తుందని, ఆయా వ్యక్తులపై కేసు నమోదు, వాహనాన్ని సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీజ్ చేసిన వాహనాలు లాక్ డౌన్ పూర్తి అయ్యాకే వాహనాలను కోర్టు ద్వారా మళ్ళీ తిరిగి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నిత్యవసర సరుకులను తమ డివిజన్ పరిధిలోనే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడీషనల్ డీసీపీ మురళీధర్, ఏసీపీలు వెంకటరెడ్డి,రామోజీ రమేష్ , జహాంగీర్ ,వెంకట్రావు పాల్గొన్నారు.