వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కొత్త వెలుగులు నింపాలి

April 5, 2019

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన హరీష్‌ ‌రావు
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో , సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని అని ఆకాంక్షించారు.. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని , ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృ ప్తినిచ్చిందని, ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు..ఈ కొత్త సంవత్సర పర్వదినం అన్ని కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని భగవంతున్నీ ప్రార్ధిస్తున్నన్నారు.