Take a fresh look at your lifestyle.

కొత్త మున్సిపాల్‌ ‌చట్టం లోపభూయిష్టం

పన్నుల భారం తప్ప..ప్రజలకు ఒరిగిందేమీ లేదు
కేటిఆర్‌..‌బిజెపి సత్తా ఎంటో చెల్లెమ్మను అడుగు..!
బిజెపి నేత నల్లు ఇంద్రాసేనారెడ్డిపార్లమెంట్‌ ఎన్నికలల్లో రాష్ట్రంలో బిజెపి పుంజుకోవడాన్ని టిఆర్‌ఎస్‌ ‌నాయకులు తట్టుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో బిజెపి లేదని..ఇక్కడ పార్టీకి స్థానం లేదని తెరాస వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌మాట్లాడడం హాస్యాస్పదం. బిజెపి సత్తా ఎంటో చెల్లమ్మను అడిగి తెలసుకొవాలని బిజెపి నేత నల్లు ఇంద్రాసేనారెడ్డి అన్నారు. సిద్దిపేటలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ..తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలల్లో కేవలం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టంకట్టారన్నారు. అనంతరం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలల్లో రాష్ట్రంలో బిజెపికి ప్రజలు స్పష్టమైన అధిక్యానిచ్చారన్నారు. రాష్ట్రంలో బిజెపి పుంజుకోవడం తట్టుకోలేక సిఎం కెసిఆర్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌బిజెపిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్నారు. అదే సమయంలో బిజెపి సభ్యత్వ నమోదుకు వస్తున్న స్పందన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కొత్త మున్సిపల్‌ ‌చట్టం పేరిట సిఎం కొత్త నాటకం మొదలు పెట్టాడన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్‌ ‌చట్టం లోపభూయిష్టంగా ఉందని బిజెపి నేత నల్లు ఇంద్రాసేనారెడ్డి ఆరోపించారు. సిఎం కేసిఆర్‌ ‌మాటలకు చేతలకు పోంతన లేదన్నారు. కొత్త మున్సిపల్‌ ‌చట్టంతో ప్రజలపై పన్నుల భారం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. కొత్త మున్సిపల్‌ ‌చట్టం తీసుకరావడంలో కుట్ర దాగివుందన్నారు. తెలంగాణ 50శాతం మేర ప్రాంతాన్ని అర్బన్‌ ఏరియాగా మార్చి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా సిఎం వ్యహరచన చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చడం వలన ఉపాధిహామీ కూలీలు ఉపాధి కొల్పోయే అవకాశం ఉందన్నారు. ఇంటి, నల్లా పన్నులతో పాటుగా ఇతర పన్నులను అధిక మొత్తంలో ప్రజల నుంచి వసులు చేయడానికే కొత్త మున్సిపల్‌ ‌చట్టం తీసుకొచ్చారని మండిపడ్డారు. దీనికి తోడు సర్పంచ్‌లు గ్రామంలో చెట్లను పెంచక పోతే పదవి నుంచి తొలగిస్తామని సిఎం అనడం హాస్యస్పదంగా ఉందన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిని ఆధికారులు తొలగించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల మూలంగా రైతులు పంట నష్ట పోతుంటే సిఎం కెసిఆర్‌ ‌పట్టించుకున్న పాపన పోలేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులు, అత్మబలిదానాలు చేసుకున్న అమరవీరుల కుంటుంబాలను అదుకోవడంలో సర్కార్‌ ‌విఫలమైందన్నారు. అదే విధంగా రాష్ట్ర సాధన ఉద్యమంలో సకల జనుల సమ్మెతో ఉద్యమాన్ని ఉదృతంగా కొనసాగించిన ఉద్యోగుల సమస్యలను సైతం పరిష్కరించడం లేదన్నారు. అన్ని వర్గాల మద్దతును కొల్పోతున్నామనే ఉద్దేశ్యంతోనే సిఎం కెసిఆర్‌ ‌బిజెపిపై అవాకులుచవాకులు మాట్లాడుతున్నారన్నారు. టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌సైతం రాష్ట్రంలో బిజెపి లేదని మాట్లాడం హస్యాస్పదం అన్నారు. నిజామాబాద్‌ ఎం‌పి స్థానం గెలుపే బిజెపికి ప్రజల మద్దతు ఉందడానికి నిదర్శన మన్నారు.
అమిత్‌షా లక్ష్యం అధిగమిస్తాం..అధికారం దిశగా అడుగులు వేస్తాంబిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిన అనంతరం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బిజెపి అధినాయకత్వం అడుగులు వేస్తుందని ఇంద్రసేనారెడ్డి అన్నారు. బిజెపి చేపట్టిన సభ్యత్వ నమోదుకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తుందన్నారు. కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లక్ష్యం 18లక్షల సభ్యత్వంను అధిగమించే దిశగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో టిఆర్‌ఎస్‌ ‌చేపట్టిన సభ్యత్వ నమోదుకు ప్రజలల్లో స్పందన కరువైందని ఎద్దెవ చేశారు. సభ్యత్వ నమోదు బద్యతలను ఎమ్మెల్యే, ఎంపి, మంత్రులకు అప్పగించిన అశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో టిఆర్‌ఎస్‌ ‌నాయకులు నైరాస్యంలో మునిగిపోయ్యారన్నారు. టిఆర్‌ఎస్‌ ‌సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులని నాయకులు ప్రజలను మబ్యపెట్టిన ప్రజలు నమ్మడం లేదన్నారు. అదే సమయంలో బిజెపి చేపట్టిన సభ్యత్వ నమోదుకు విద్యార్థులు, రైతులు అన్ని వర్గాల నుంచి అనుహ్యమద్దతు వచ్చిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అమిత్‌షా అదేశాల మేరకు పనిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తం రెడ్డి,నాయకులు వంగ రామచంద్రారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పత్రి శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌దూది శ్రీకాంత్‌రెడ్డి, గోనె మార్కండేయులు, చొప్పదండి విద్యాసాగర్‌, ‌గుండ్ల జనార్ధన్‌, ‌రామచంద్రరావు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy