కొండరెడ్ల గ్రామాలలో మౌళిక వసతులే లక్ష్యంగా భద్రాచలం ఐ.టి.డి.ఏ నిరంతరం కృషిచేస్తుందని భద్రాచలం ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్ పోట్రు తెలిపారు. బుదవారం నాడు ఆశ్వారావుపేట మండలం తిరమల కుంట, రెడ్డిగూడెం, బండారి గుంపుకొండరెడ్ల గ్రామాలలో పి.ఓ విసృతంగా పర్యటించారు.ముందుగా తిరుమల కుంట గ్రామంలో కొండరెడ్లకోసం ఐ.టి.డి.ఏ ద్వారా నిర్మించిన 17 డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను పి.ఓ పరిశీలించారు. ఈసందర్బంగా పి.ఓ మాట్లాడుతూ కొండరెడ్లకు ఇంజనీరింగ్ విబాగం ద్వారా కొండరెడ్లకు నాణ్యతలో రాజీపడకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్దాయిలో కొండరెడ్ల ప్రత్యేకాధి కారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నివాస గృహాలు నిర్మించడం జరిగిందని అవి పూర్తి అయినవని సాద్యమైనంత తొందరలో ప్రారంబిస్తామని కొండరెడ్ల గ్రామాలలో అన్ని రకాల మౌళిక వసతులపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సి.సిరోడ్లు,డ్రైనేజి కల్వర్ట్లు ఇప్పటికే పూర్తి చేసి ఇవ్వడం జరిగిందని అన్నారు.
అనంతరం రెడ్డి గూడెం గ్రామంలో కల్వర్ట్ డ్రైనేజీని పరిశీలించారు. అనంతరం బండారి గుంపు గ్రామంలోఅల్లివాగు వద్ద చెక్‌డ్యామ్ నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్దం చేసిన ప్రాంతాన్ని పి.ఓ పరిశీలిం చారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామి పధకం నిదులతోకొండరెడ్ల గ్రామాలలో సుమారు 05 కోట్ల రూపాయల వ్యయంతో 05 చెక్‌డ్యామ్‌ల నిర్మించుట కొరకు ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగిందని అందులో బాగంగానే ఈరోజు అల్లి వాగుపై చెక్ డ్యామ్ 1కోటి.10లక్షల వ్యయంతో ప్రతిపాదనలతో సిద్దం చేసిన ప్రాంతాన్ని పరిశీలించామని ఇక్కడ చెక్ డ్యామ్ కట్టడం వలన అసలు ఎంత మందికి ప్రయోజనం చేకూరుతుంది ఎన్ని ఎకరాలు సాగులోనికి వస్తాయి,ఎక్కువ వరధ ఉదృతి వచ్చినప్పుడు చెక్ పరివాహక ప్రాంతాలలో పోలాలునీటిలో మునగడం ఏమైనా జరుగుతుందా అనే విషయాలను పూర్తిగా పరిగణ లోనికి తీసుకోవాలని సంబందిత ఎ.ఇ ప్రసాద్‌ను ఆదేశించారు. కొండరెడ్ల గ్రామాలలను నిరంతరం పర్యవేక్షిస్తూ మౌళిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న యస్వో సురేష్‌బాబును పి.ఓ అభినం దించారు. ఈకార్య క్రమంలో కోండరెడ్ల ప్రత్యేకాదికారి మరియు యస్వో సురేష్ బాబు,ఇంజనీరింగ్ ఎ.ఇప్రసాద్, రామ్‌కుమార్ గ్రామస్తులు పాల్గోన్నారు.