వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కేసుల విచారణ మరింత పారదర్శకంగా చేయాలి : ఎస్పీ రంగనాధ్

September 21, 2019

కేసుల విచారణలో పోలీస్ అధికారులంతా నాణ్యవంతంగా చేస్తూ ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా ప్రజలలో పోలీస్ వ్యవస్థపై మరింత గౌరవం పెరిగే విధంగా పనితీరు ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ చెప్పారు.శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసుల విచారణతో పాటు పనితీరు మరింత మెరుగు పర్చుకోవాలని లేకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అదే సమయంలో మంచి పనితీరు కనబర్చిన అధికారులకు సరైన గుర్తింపు కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో కేసులు, అధికారుల పనితీరును పరిశీలించడానికి స్వయంగా పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శించి పెండింగ్ కేసులు, కేసుల విచారణ, సిబ్బంది, పోలీస్ స్టేషన్ల పరితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతున్నదని ఎస్పీ రంగనాధ్ తెలిపారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించి త్వరితంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రజలలో మనపై మరింత గౌరవం పెరిగే విధంగా అధికారుల పనితీరు ఉండాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సిసిటిఎన్ఎస్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పాయింట్ బుక్స్ ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ద్వారా అన్ని ప్రాంతాలలో పెట్రో వాహనాలు, సిబ్బంది అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్నారో లేదో పరిశీలించాలని చెప్పారు.