Take a fresh look at your lifestyle.

కేసిఆర్‌ ముందస్తు ముచ్చట తీరేనా?

యావత్‌ భారతదేశ ప్రజల దృష్టిని ఒక్క సారి తెలంగాణ వైపుకి తిప్పుకోగలిగిన ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శాసన సభ ఎన్నికలకు తొమ్మిది నెలల గడువు ఉన్నప్ప టికినీ ముందుగానే సెప్టెంబర్‌6వ తేదీన మధ్యా హ్నం ఒంటి గంటకు ఆగమేఘాల మీద శాసన సభను రద్దు చేస్తూ క్యాబినెట్‌ తీర్మానము చేసి దాని ప్రతిని రాజ్యాంగ ప్రతినిధి అయిన రాష్ట్ర గవర్నర్‌కు అందజేసారు. గవర్నర్‌ అసెంబ్లీ రద్దు విషయాన్ని ఆమోదిస్తూ రాజముద్ర వేసి కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నికల వరకు కొన సాగాలని ఆదేశించడం, గెజిట్‌ విడుదల చేయడం చకచకా జరిగిపోయినవి. దేశరాజకీయాలలో చక్రం తిప్పాలని గత ఆరు నెలలుగా కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కర్నాటక రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ముఖ్య మంత్రులతో చర్చించి దేశ రాజకీయాలలో గుణా త్మకమైన మార్పు కోసము ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తును వారుసులకి అప్పచెప్పి దేశీయ రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించాలని చేస్తున్న ప్రయత్నాలలో ప్రధానంగా దేశ రాజ కీయాలలో పెద్ద రాజకీయ వ్యవస్థలుగా వెలు గొందుతున్న వాటిలో ఒకటి కాంగ్రెస్‌, రెండవది బీజేపీ. ఈ రెండు పార్టీలకు భిన్నంగా జాతీయ గుణాత్మక మార్పు పార్టీగా ఆవతారమెత్తి జాతీయ రాజకీయాలలో అధికారాన్ని చేపట్టాలని ఆలోచన చేసిన కేసీఆర్‌ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ఆశలు రేకెత్తించగల నేర్పరి కేసీఆర్‌. అయితే ముం దుగ రాష్ట్ర రాజకీయాలలో ముందస్తు మాట లేనప్పటికీ ఇక్కడ రాజకీయ వాతావరణాన్ని గమ నించకుండానే ఒక్కసారిగా జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా గుణాత్మక మార్పు వచ్చే ప్రమాదాన్ని గమనించి వేలువెంటనే జాతీయ రాజకీయాల విషయాన్ని ఆయన పక్కన బెట్టినాడు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలం గాణ ప్రజలకు అందించాలని భావించిన ముఖ్య మంత్రి కేసీఆర్‌ 24 గంటల కరెంటును ప్రవే శపెట్టి తెలంగాణ రైతులతో సెహబాష్‌ అనిపించు కున్నాడు. ఇందులో భాగంగానే గత మే 10వ తేదీన అందరి అంచనాలకి భిన్నంగా ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రైతుబంధు పథకము ప్రవేశపెట్టి రైతులలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. వీటితో పాటుగా పలు పతకాలని ప్రవే శపెట్టినప్పటికీ 24 గంటల విద్యుత్తు, మిషన్‌ భగీరథ వంటి పథకాలు ప్రచార అస్త్రాలలో ప్రథమ స్థాయిలో నిలిచినాయి. కేసీఆర్‌ తన ఆలో చన విధానాలలో విద్యా విధాన వ్యవస్థపై చిన్న చూపు చూడటం జరిగిందని పలువురు విద్యా మేధావులు విమర్శించడం, మనము ప్రసార మాధ్య మాలలో చూడటము జరిగింది. రాష్ట్రంలో సర్వ తోముఖాభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మొదటగా ప్రజలు అన్ని విషయాలలో అండదండలుగా నిలిచిన విషయం వాస్తవమే. అయినప్పటికీ నీళ్లు, నిధులు, నియమా కాల పేరుతో 14 ఏళ్లు ఉద్యమాన్ని చేపట్టిన కేసీ ఆర్‌ ప్రజల ఆశయాలకి అనుగుణంగా పరిపాలన చేపట్టలేదన్న ప్రజల విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని, ముందుగా ఊహించక పోవడంతో ఆకస్మాత్తుగా శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు శంఖం ఊది 105 మంది అభ్యర్థులను ప్రకటించిన మొదటి వ్యక్తి కెసిఆర్‌. రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో ఒకసారి మార్పు తీసుకురావాలని భావిస్తున్న బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల విధానాలకు దొరికినట్టే దొరికి తన రాజకీయ చతురతతో 2018 శాసనసభ ఎన్నికలలో విజయం సాధిం చాలని భావిస్తున్న కెసిఆర్‌ ముందస్తు ముచ్చట తీరేనా? అని ప్రశ్నలు రేకెత్తిస్తున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్‌, సిపిఐ, సిపిఎం, బిజెపి పార్టీలు ముందస్తుకు

అస్త్ర శస్త్రాలని తయారు చేసుకునే సరికి టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల బరిలో ప్రచారంలో ముందు వరుసలో ఉంది. బిజెపి, టిఆర్‌ఎస్‌ రెండూ ఒకే కోవలో ఉంటాయని ప్రతిపక్షాలు భావిస్తున్న తరుణంలో బిజెపి తెలంగాణలో పాగా వేసేనా?కాంగ్రెస్‌ పార్టీ 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీగా కాకలు తీరిన రాజకీయ విధానా లతో తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలని భావించిన ప్పటికీ అధికార పక్షం దూకుడుకు సమాంతరంగా కాంగ్రెస్‌ పార్టీ పరుగులు తీసేనా. గడిచిన నాలుగున్నర సంవత్స రాలలో అధికార పక్షం కేవలం గ్రామీణ వోటర్లని ఆకర్షించుకునే విధంగా పథకాలని ప్రవేశపెట్టినట్లు బహిరం గంగా కనపడుతున్నా తెలంగాణ సాధనలో యువత ఏ ఆశయము కోసం ఉద్యమించారో ఆ ఆశయాలకు అనుగుణంగా పాలనను అందించ లేదని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2018 డిసెంబర్‌ 7 తేదీ శాసనసభ ఎన్నికలలో యువ వోటర్లే గెలుపు, ఓటములలో ప్రధాన పాత్ర పోషి ంచే అవకాశం ఉన్నది కాబట్టి రాజకీయ పార్టీలు యువతను తమ వైపునకు ఆకర్షించే విధంగా వివిధ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలను తయారు చేస్తున్నాయి. వోటు విషయంలో అధికార పార్టీ కొంత వరకు నిర్లక్ష్యం చేసిన విషయము యువత చర్చించుకుంటున్న దాన్ని బట్టి తెలు స్తున్నది. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించి పని చేసే పార్టీలకే ప్రజలు వోటు వేసి గెలిపించే అవకాశం ఉంది. ముందస్తు విషయ ములో అధికార పార్టీకి ఆ అవకాశము దక్కేనా అని అందరూ వేచి చూడాల్సిన సమయమిది.

డాక్టర్‌ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy