Take a fresh look at your lifestyle.

కేంద్ర కోవిడ్‌ ఉపశమన పథకాలు మిథ్య

నగర అవసరాల మేరకు నాలాల అభివృద్ధి
పాఠశాలల్లో ఉపాధ్యాయుల రేషనలైజషన్‌…‌తరువాతే వాలంటీర్ల నియామకంపై ఆలోచన
ప్రణాళికాబద్ధంగా గ్రామాల పురోభివృద్ధి
విద్యుత్‌ ‌వినియోగంలో తెలంగాణ ఆదర్శం…అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్తు
ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణి స్త్రీలు, బాలింతలు, పిల్లలకు  పోషకాహారం
అసెంబ్లీ, కౌన్సిల్‌లలో సభ్యుల పలు ప్రశ్నలకు సంబంధిత మంత్రుల సమాధానాలు

కేంద్ర ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌మండిపడ్డారు. కొవిడ్‌ ‌సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పారిశ్రామిక రంగంపై కొరోనా మహమ్మారి ప్రభావంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం ఇచ్చారు. కేంద్రం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీల వల్లే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వొస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ ‌సమయంలోనూ కొత్త పెట్టుబడుల వృద్ధిలో ఎలాంటి తగ్గుదల లేదని స్పష్టం చేశారు. 2020-21లో 3,445 కొత్త పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదించాం. 2021-22 ఇప్పటివరకు 1777 కొత్త ప్రతిపాదనలు ఆమోదించాం అని కేటీఆర్‌ ‌తెలిపారు. కోవిడ్‌ ‌మహమ్మారి ప్రారంభం నుంచి కొత్త పెట్టుబడులకు తెలిపిన ఆమోదాల వల్ల 2,06,911 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

నగర అవసరాల మేరకు నాలాల అభివృద్ధి
భవిష్యత్‌ అవసరాలు, నగరం విస్తరణను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక నాలా అభివృద్ధిని చేపట్టామని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. నగరు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్యను ఎలా తీర్చామో? అదే విధంగా అండర్‌  ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం ఇచ్చారు. నగరంలో వరద సమస్యను నివారించేందుకే వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇటీవల ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తిస్తామన్నారు. సమగ్ర విచారణ చేపట్టి నాలా గ్రిడ్‌ ‌మెరుగుదల కోసం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని కేటీఆర్‌ ‌వెల్లడించారు. మొత్తం ప్రధాన కాలువలను 173 కిలోవి•టర్లుగా మదింపు చేసి మొదటి దశ కింద జాబితాను ఖరారు చేశాం అని కేటీఆర్‌ ‌తెలిపారు. 2021లోనే వర్షాకాలం రాకముందే ఈ పనిని చేపట్టి వరదనీటి డ్రైనేజీ నెట్‌వర్క్‌లో కనీసం 30 శాతాన్ని పూర్తి చేయాలనుకున్నాం. జీహెచ్‌ఎం‌సీ అధికారులను సంప్రదించి.. కిర్లోస్కర్‌, ‌వోయన్టస్ ‌నివేదికలను పరిగణలోకి తీసుకుంటూ ఎస్‌ఈపీఈ ఇన్‌‌ఫ్రా కన్‌స్టలెన్సీని సంప్రదించి.. జీహెచ్‌ఎం‌సీ జాబితాకి ప్రాధాన్యత ఇచ్చాము అని కేటీఆర్‌ ‌తెలిపారు.

పాఠశాలల్లో ఉపాధ్యాయుల రేషనలైజషన్‌…‌తరువాతే వాలంటీర్ల నియామకంపై ఆలోచన
రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులుండి, ఎక్కువ మంది ఉపాధ్యాయులున్న పాఠశాలలను గుర్తించే రేషనలైజేషన్‌ ‌చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ పోస్టులను సర్దుబాటు చేసిన తర్వాత విద్యావాలంటీర్ల నియామకం గురించి ఆలోచిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు గతంలో గ్రాంట్‌ ‌రూపంలో నిధులు మంజూరు చేశామని తెలిపారు. గత మూడేండ్ల నుంచి రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు.. 2017-18లో రూ.38 కోట్లు, 2018-19లో రూ.49 కోట్లు, 2019-20లో రూ.46 కోట్లు, 2020-21లో రూ.80 కోట్లు, 2021-22 ఏడాదికి రూ.80 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 ఎకరాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మైదానం ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రకృతి వనాల ఏర్పాటుకు కలెక్టర్లకు తామే ఆదేశాలు ఇచ్చామన్నారు. ఆ పార్కుల వల్ల పిల్లలకు కూడా మంచి వాతావరణం ఇచ్చిన వాళ్లం అవుతామన్నారు. గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న పాఠశాలల నిర్వహణను లోకల్‌ ‌బాడీస్‌, ‌కార్పొరేషన్‌, ‌మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పాఠశాలలను అర్బన్‌ ‌లోకల్‌ ‌బాడీస్‌ ‌చూసుకోవాలని చెప్పారు. ఇక చాలా గ్రామాల్లో సర్పంచ్‌లే బాధ్యత తీసుకుని పాఠశాల నిర్వహణను చూస్తున్నారు. ఎక్కడైనా సర్పంచ్‌లు పాఠశాలల నిర్వహణ బాధ్యత తీసుకోకపోతే ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేసి తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.  గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అంగన్‌వాడి స్కూల్స్ ‌తమవే అనే భావన సర్పంచులకు రావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సమన్వయం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ అదేశాలిచ్చారన్నారు. స్కూల్‌ ‌స్థలాల్లో ప్లలె ప్రకృతి వనం ఏర్పాటుపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. కలెక్టర్‌లకు నిర్ణయాధికారం ఇచ్చామన్నారు. పల్లె ప్రకృతి వనం పార్క్ ‌లాంటిదే కదా.. ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని సూచన చేశామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ప్రణాళికాబద్దంగా గ్రామాల పురోభివృద్ధి
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు అన్నారు. గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక శ్రద్ధ వహించారని మంత్రి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గ్రామాల్లో వైకుంఠ ధామాలు, డంపింగ్‌ ‌యార్డుల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి దయాకర్‌ ‌రావు సమాధానం ఇచ్చారు. గ్రామాలను బాగు చేసేందుకు ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలకు గానూ ఇప్పటి వరకు 12,672 వైకుంఠధామాలు, 12,737 డంపింగ్‌ ‌యార్డులను ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 147 గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌ ‌యార్డులను ఈ ఏడాది అక్టోబర్‌ ‌వరకు పూర్తి చేశాం. వైకుంఠధామాల కోసం రూ. వెయ్యి కోట్ల 547 కోట్లు, డంపింగ్‌ ‌యార్డుల కోసం రూ. 319 కోట్లు ఖర్చు చేశామన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. నిధులను ఏ రూపంలో వాడుకుంటున్నామో అవగాహన తెచ్చుకోవాలి. కానీ రాష్ట్రం నిధులా? కేంద్రం నిధులా? అన్న ప్రశ్న ఉత్పన్నం కావొద్దన్నారు. వైకుంఠధామాలను ఒక టెంపుల్‌ ‌మాదిరిగా అద్భుతంగా తీర్చిదిద్దాం. మిషన్‌ ‌భగీరథ నీళ్లను వైకుంఠధామాలకు అందిస్తున్నాం. ప్లలె ప్రకృతి వనాలను అందంగా తయారు చేశామన్నారు. ప్రతి ఊరిలో నర్సరీ ఏర్పాటు చేసి, ప్రజలకు అవసరమైన మొక్కలను అందిస్తున్నాం. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ను కేటాయించామన్నారు. నరేగా నిధులను అద్భుతంగా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారని ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు తెలిపారు.

విద్యుత్‌ ‌వినియోగంలో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ…అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు
తలసరి విద్యుత్‌ ‌వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉందని విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ ‌వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ‌దార్శనికతతో విద్యుత్‌ ‌సమస్యను అధిగమించామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్‌ ‌విజయం సాధించామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అం‌దిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని జగదీశ్‌ ‌రెడ్డి తేల్చిచెప్పారు. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి తలసరి విద్యుత్‌ ‌వినియోగం 2,012 యూనిట్లు. మొత్తం తలసరి వినియోగానికి సంబంధించి దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉందన్నారు. వృద్ధిరేటులో మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9,600 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా చేర్చడం జరిగిందన్నారు. 7,962 మెగావాట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. టీఎస్‌ ‌జెన్‌కో ద్వారా థర్మల్‌లో 2, 210 మెగావాట్లు, హైడల్‌లో 3,360 మెగావాట్లు, ఇతర రంగాల నుంచి 2200 మెగావాట్లు, ప్రయివేటు రంగాల నుంచి 570 మెగావాట్లు, సౌర విద్యుత్‌ ‌నుంచి 3,415 మెగావాట్లు, పవన విద్యుత్‌ ‌నుంచి 128 మెగావాట్లు అదనంగా చేర్చామన్నారు. టీఎస్‌ ‌జెన్‌కో ద్వారా నిర్మాణంలో ఉన్నవి 4,270 మెగావాట్లు, ఎన్టీపీసీ ద్వారా 1600 మెగావాట్లు, సౌరవిద్యుత్‌ ‌ద్వారా 2,092 మెగావాట్లు.. మొత్తం కలిసి 7,962 మెగావాట్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణి స్త్రీలు, బాలింతలు, పిల్లలకు  పోషకాహారం
రాష్ట్రంలో గర్భిణి స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి ఆరోగ్యలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్య లక్ష్మి పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌సమాధానం ఇచ్చారు. గర్భిణిలు, పిల్లల పోషణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి బాలామృతం అందిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చామని మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌తెలిపారు. ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒకటి. మహిళలు, పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. 2015, జనవరి 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గర్భిణిలకు, బాలింతలకు ప్రతి రోజు 200 ఎంఎల్‌ ‌పాలు, ఒక కోడిగుడ్డుతో పాటు భోజనం అందిస్తున్నాం. ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు 16 గుడ్లు(నెలకు), 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 30 గుడ్లను(నెలకు) అంగన్‌వాడీ సెంటర్‌ ‌నుంచి అందిస్తున్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణిలు, బాలింతలు 4,65,805 మంది, ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 10,43,419, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు ? 6,74,336 మంది లబ్ది పొందుతున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కోసం 2015 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ. 11 వందల 10 కోట్ల 89 లక్షలను ఖర్చు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో అంగన్‌వాడీలను బలోపేతం చేశాం. అంగన్‌వాడీ టీచర్లు విశేషంగా సేవలందిస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు రూ.10,500 గౌరవ వేతనం పొందుతున్నారు. దీంట్లో కేంద్రం వాటా రూ. 2700, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,800 అని తెలిపారు. ఆయాలకు కేంద్ర వాటా రూ. 1350, రాష్ట్రం వాటా రూ. 4650 ఇస్తున్నాం. పీఆర్సీ అమలైతే టీచర్లకు రూ. 13 వేలకు పైగా, ఆయాలకు అదనంగా రూ. 1300 వస్తుందన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల రిక్రూట్‌మెంట్‌ ‌కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.

Leave a Reply