Take a fresh look at your lifestyle.

కెసిఆర్ సారు మళ్లీ రావాలి.

కోరుట్ల నియోజకవర్గం రోడ్ షో లో ఎంపి కవిత

 

ఏ పని చేసినా మనసు పెట్టి పని చేసే కెసిఆర్ సారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం , మల్లాపూర్ మెట్ పల్లి టౌన్ లలో రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. మల్లాపూర్ లో వేలాది మందితో కిలోమీటరు పొడవునా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో మహిళలతో కలిసి ఎంపి కవిత నడిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 60 ఏళ్లలో చేయని పనులను నాలుగేళ్లలో చేసిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజల పట్ల ఉన్న ప్రేమ అభిమానాలకు నిదర్శనమని అన్నారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర ఇతర రాష్ట్రాలు ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలిస్తున్నారని కవిత వివరించారు. మన పొరుగున ఉన్న మహారాష్ట్ర లోని 40 గ్రామాల సర్పంచ్ లు మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోవాలని కోరారని, ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కు లభించిన ప్రశంస అన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలని కూటమి కట్టిన నాయకులు ఆయన ఎందుకు గద్దె దించాలని అనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించాలని కోరారు. 24 గంటలపాటు కరెంటు ఇస్తున్నందుకా.. రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నందుకా.. కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేస్తున్నందుకు కేసిఆర్ కిట్ ద్వారా పేదింటి గర్భిణీలకు పురుడుపోసి.. మగ పిల్లాడు పుడితే 12000 ఆడపిల్ల పుడితే 13000 ఇస్తున్నందుకా, పెన్షన్లను డబుల్ చేస్తామని చెప్పినందుకా, ఎందుకోసం కేసీఆర్ ను గద్దె దించాలో కూటమి నేతలు చెప్పాలన్నారు. కవిత వెంట కోరుట్ల టిఆర్ఎస్ అభ్యర్థి కే. విద్యాసాగర్ రావు, స్థానిక నాయకులు ఉన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy