Take a fresh look at your lifestyle.

కృష్ణా బేసిన్‌లో కొనసాగుతున్న వరద

శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న నీరు
కర్నూలు,జూలై 26 : కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల తో పాటు, నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89,128 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండగా.. ఔట•ఫ్లో 34,079 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 868 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 135 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ ‌కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టుకు 31,784 క్యూసెక్కులు వరద వస్తుండగా.. వెయ్యి క్యూసెక్కులు ఔవుట్‌ ఎ•-‌లో ఉన్నది. సాగర్‌ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగలకు గాను.. ప్రస్తుతం 538 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 184.1840 టీఎంసీలు నిల్వ ఉంది.  పూర్తిస్తాయి నీటిమట్టానికి చేరువువతోంది. ఎగువన వర్షాలకు నీరు రావడంతో ప్రాజెక్టులను నిండుకుండల్లా మార్చింది. కర్ణాటకలో ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు నిండిపోగా.. తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులు కూడా ఒక్కొక్కటిగా నిండుతున్నాయి. కృష్ణా బేసిన్‌ ‌లోని అల్మట్టి, నారాయణపూర్‌, ‌జూరాల వరకు వరద పోటెత్తుతోంది. అటు తుంగభద్రకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణమ్మ ఉరకలెత్తి ప్రవహిస్తుండడంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. దాంతో జులై నెలలోనే వరదనీటితో శ్రీశైలం ప్రాజెక్ట్ ‌కళకళలాడు తోంది. వరద ఇంకా కొనసాగే అవకాశాలు ఉండటంతో.. ఈ నెలలోనే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిపోయే అవకాశముంది.

Leave a Reply