వరదప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లను పంపాలి
ఇక రాష్ట్రంలో కరువు ఉండదు..వరద నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాలి
ఫ్లడ్మేనేజ్మెంట్ను శాశ్వతంగా ఏర్పాటు చేయాలి
వరదలపై అధికారులతో ఉన్నత స్థాయి సవి•క్షలో సిఎం కెసిఆర్
భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తం
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నీటి పారుదల, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కెసిఆర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రిజర్వాయర్లు, ప్రాజెక్ట్‌ల నుండి నీటిని నెమ్మదిగా వదలాలన్నారు. ఏడు, ఎనిమిది మందితో కూడిన ప్లడ్ మేనేజ్మెంట్ టీమ్ ను శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. తద్వారా ప్రతి సంవత్సరం వరదల రికార్డ్‌ను పాటించాలన్నారు. పాత రికార్డ్‌ను అనుసరించి ఆయా వరద సమయాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సవి•క్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన వాటిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సవి•క్షా సమావేశం జరుగుతున్నది. సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు ఇతర విభాగాల ఉన్నతాధికారులు భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు తక్షణమే పంపించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిరాశ్రయులకు, వసతి, బట్టలు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా నదీ ప్రవాహం కూడా పెరిగే పరిస్థితి ఉన్నందున నాగార్జున సాగర్ కు ఉన్నతాధికారులను పంపించాలని ఆదేశించారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రప్పించాలని తెలిపారు. హెలికాప్టర్ లను మరిన్ని తెప్పించాలని, గతంలో వరదల పరిస్థితులను ఎదుర్కున్న అధికారులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మూసీ నది వరద గురించి ఆరా తీసిన సీఎం వరద ఉధృతి పెరిగే పరిస్థితి ఉంటే మూసీ లోతట్టులో నివాసం ఉంటున్న ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే వాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని ప్రజలకు సూచించారు. మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ గురువారం సవి•క్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో సీఎం చర్చించారు. వరద పరిస్థితిని ఎదుర్కునేందుకు శిక్షణ పొందిన అధికారులతో కూడిన టీంను శాశ్వత ప్రాతిపదికన తక్షణమే ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. జీఏడీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ తదితర ప్లడ్ చర్యల్లో పాల్గొనే వ్యవస్థలను సమన్వయం చేసుకోగలిగే అధికారి ఉండాలన్నారు. సభ్యుల్లో ఒకరు రిహాబిలిటేషన్ క్యాంప్ లను నిర్వహించడంలో అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఆర్మీ, పోలీస్, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థలను అప్రమత్తం చేసుకోవడానికి ఒక అధికారి, వైద్య శాఖ, ఆర్ అండ్ బి శాఖ, పంచాయితీ రాజ్ శాఖను సమన్వయం చేసుకోగల అనుభవం ఉన్న అధికారిని నియమించాలని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎం వివరించారు. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఇండ్ల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం స్పష్టం చేశారు. డ్రైనేజీ పరిస్థితుల వి•ద ఆరా తీసిన సీఎం తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజా రక్షణ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనావేసి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ బ్రిడ్జీలు, రోడ్ల పరిస్థితులను పరిశీలించి ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. స్వీయ నియంత్రణ చర్యలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు, చెరువుల వైపు సంచరించకూడదని, వరద ఉధృతిలో వాగులు, వంకలు దాటేందుకు సాహసకృత్యాలకు పాల్పడకుండా ఉండాలని సీఎం ప్రజలకు సూచించారు.